పలువురి సంతాపం..
నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి మృతదేహం అప్పగింత
నవతెలంగాణ- మిర్యాలగూడ టౌన్
మానవ హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడిన ప్రముఖ సామాజిక కార్యకర్త, మానవహక్కుల వేదిక నాయకులు సుబ్బారావు(92) గురువారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని జ్యోతి ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేసిన ఆయన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయని పలువురు ఆయనకు జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సుబ్బారావు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి ఎంతోమంది విద్యార్థులను ఉన్నత చదువులకు ప్రోత్సహించారని తెలిపారు. ఉద్యోగ విరమణ అనంతరం పౌర హక్కుల కోసం పోరాటాలు నడిపారని గుర్తు చేశారు. మృతదేహాన్ని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తిప్పన విజయ సింహారెడ్డి, భాస్కరరావు, సీపీఐ(ఎం) నాయకులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, డబ్బికార్ మల్లేష్, వీరేపల్లి వెంకటేశ్వర్లు, మల్లు గౌతమ్‌రెడ్డి, డాక్టర్లు రామారావు, రాజు, టాప్రా నాయకులు జగదీష్ చంద్ర, గర్దాసు సత్య నారాయణ, కేశవులు, రమణారెడ్డి, సత్యనారాయణరావు, అనంతరెడ్డి తది తరులు సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మృతదేహాన్ని వైద్య విద్యార్థుల అధ్యయనం కోసం నలగొండ ప్రభుత్వ ఆస్పత్రికి అప్పగించారు.
మానవహక్కుల వేదిక నాయకులు సుబ్బారావు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



