Friday, June 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆంధ్ర మంత్రులు అమరావతిలోనే ఉండాలి

ఆంధ్ర మంత్రులు అమరావతిలోనే ఉండాలి

- Advertisement -


ఇక్కడే ఉంటే అక్కడ అభివృద్ధి ఎలా చేస్తారు?
ఏపీలో ధాన్యం కొనుగోలు చేయడం లేదు
మీడియా చిట్‌చాట్‌లో శాసనమండలి చైర్మెన్‌ గుత్తా


నవతెలంగాణ – నల్లగొండ టౌన్‌

ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, ఇతర మంత్రులు అమరావతిలోనే నివాసం ఉండాలని, ఇక్కడే ఉంటామంటే కుదరదని శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో చిట్‌ చాట్‌ నిర్వహించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు పవన్‌ సభ పెట్టడమేంటని ప్రశ్నించారు. పవన్‌ మాట్లాడే భాష మార్చుకోవాలని సూచించారు. కూటమికి సంబంధించిన నాయకులంతా అమరావతి బ్రహ్మాండం అని, ఈ భూగోళంలోనే అలాంటి రాజధాని లేదని చంద్రబాబు, పవన్‌ మాట్లాడుతున్నారని తెలిపారు. అలాంటిది వాళ్లు ఇక్కడ ఉంటామనడం ఎందుకని, ఇక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి ఎలా చేస్తారని ప్రశ్నించారు. షటిల్‌ సర్వీసులు బంద్‌ చేసుకోవాలని, పరస్పర దూషణలు సరైనవి కావని సూచించారు. రాష్ట్రం విడిపోయి 12 ఏండ్లు అవుతుంటే.. ఇంకా ఇక్కడ పార్టీలు పెడతాం.. పోటీ చేస్తామనేది ప్రజల మధ్య విద్వేషాలు తీసుకురావడం కోసమే అని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ నేతల మాట్లాడే విధానం సరిగా లేదని విమర్శించారు. ఏపీలో మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయడం లేదని, దళారులు క్వింటా రూ.1600కు కొనుగోలు చేసి తెలంగాణ మిల్లులకు రూ.1850కు అమ్ముకుంటున్నారని తెలిపారు. ‘మీరు చెప్పే మాటలకు చేతలకు సంబంధం లేదు’ అని అన్నారు. తెలంగాణ మాత్రమే ధాన్యం సేకరణలో ప్రతి గింజనూ కొనుగోలు చేస్తోందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -