నవతెలంగాణ-ఆలేరు టౌన్: ఆలేరు మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆలేరు మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి అధికారి, ఆర్డీవో కృష్ణారెడ్డి అన్నారు. ఆలేరు పట్టణంలో మంగళవారం ఆలేరు మున్సిపాలిటీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ని సందర్శించారు. పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ బాక్స్‌లను, ఎన్నికల సామాగ్రిని పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ సెంటర్‌లో ఏర్పాట్లు పరిశీలించారు.ఎన్నికల సిబ్బందిని బస్సుల ద్వారా వారి పోలింగ్ స్టేషన్‌కు ఎన్నికల సామాగ్రి తరలించారు.ఉద్యోగులందరూ అప్రమత్తంగా ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా డ్యూటీలు సక్రమంగా నిర్వర్తించాలని తెలియజేశారు.
పాత ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం కొలనుపాక రోడ్డు,జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, బీసీ కాలనీ ,పిఎసిఎస్ కార్యాలయం వద్ద, ఎస్సీ కాలనీ, తోపాటు మరికొన్నిచోట్ల పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. పోలీసుల పర్యవేక్షణలో పోలింగ్ బూతులు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో సహాయ జిల్లా ఎన్నికల అధికారి, కమిషనర్ కే.శ్రీనివాస్ రెడ్డి, తహసిల్దార్, ఎంపీడీవో రిటర్నింగ్ ఆఫీసర్లు వి.ఆంజనేయులు,ఎం.సత్యాంజనేయ ప్రసాద్, పి.అనురాధ,హేమంత్ కుమార్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు దూడల వెంకటేష్,ఏం.తిరుపతి రెడ్డి, కే.ఉమా శంకర్, ఎస్. సత్తిరెడ్డి, సిహెచ్. ఉదయ్ కుమార్ మున్సిపల్ మేనేజర్ బి.జగన్ మోహన్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.


