నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: శ్రీ సరళ మైసమ్మ దేవస్థానం వ్యవహారంలో అల్లాపురం గ్రామ సర్పంచ్ అనధికారంగా జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ దేవస్థాన కమిటీ నాయకులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. దేవస్థాన కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు వరకాంతం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు చౌటుప్పల్ ఆర్డీవో వెల్మ శేఖర్ రెడ్డి మండల పరిషత్ అభివృద్ధి అధికారి బొమ్మ సందీప్ కుమార్‌లకు మంగళవారం వినతిపత్రం సమర్పించారు.
వారు తెలిపిన వివరాల ప్రకారం శ్రీ సరళ మైసమ్మ దేవస్థానం అల్లాపురం గ్రామ పంచాయతీ పరిధిలోకి రాదని,అది నారాయణపురం మండలంలోని రాచకొండ సర్వే పరిధిలోకి వస్తుందని తెలిపారు. అయినప్పటికీ అల్లాపురం సర్పంచ్ దేవస్థానం వ్యవహారాల్లో అనధికార చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంపై తక్షణ విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు



