Wednesday, February 11, 2026
E-PAPER
Homeసినిమాప్రేమికుల రోజు కానుక..

ప్రేమికుల రోజు కానుక..

- Advertisement -

సంతోష్‌ శోభన్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘కపుల్‌ ఫ్రెండ్లీ’. మానస వారణాసి హీరోయిన్‌. యూవీ క్రియేషన్స్‌ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్‌ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తోంది. అజరు కుమార్‌ రాజు.పి కో ప్రొడ్యూసర్‌. అశ్విన్‌ చంద్రశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజికల్‌ రొమాంటిక్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా వాలెంటైన్స్‌ డే సందర్భంగా ఈ నెల 14న తెలుగు, తమిళంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను ప్రొడ్యూసర్‌, డిస్ట్రిబ్యూటర్‌ ధీరజ్‌ మొగిలినేని ఏపీ, తెలంగాణలో రిలీజ్‌ చేస్తున్నారు.
మేకర్స్‌ నిర్వహించిన ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ప్రొడ్యూసర్‌, డిస్ట్రిబ్యూటర్‌ ధీరజ్‌ మొగిలినేని మాట్లాడుతూ, ‘ఇది ఒక ప్యూర్‌ లవ్‌ స్టోరీ. చెప్పాలంటే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అనుకోవచ్చు. ఈ మూవీలో హీరో హీరోయిన్స్‌కు ఒక మంచి ఫ్యామిలీ నేపథ్యం, కుటుంబ సభ్యులు ఉంటారు. వారి పాత్రలకు ఇంపార్టెన్స్‌ ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు మా సినిమాను ఇబ్బందిపడకుండా చూడొచ్చు. ఈ చిత్రంతో మా హీరో సంతోష్‌ శోభన్‌కు ఘన విజయం దక్కుతుందని, ఆయన స్టార్‌ హీరోల సరసన చేరుతారని ఆశిస్తున్నాం. మానస వారణాసి తన పాత్రకు లైఫ్‌ ఇచ్చింది. గురువారం చెన్నైతో పాటు హైదరాబాద్‌, తిరుపతి, నెల్లూరు, వైజాగ్‌, విజయవాడలో ప్రీమియర్స్‌ వేయాలని ప్లాన్‌ చేస్తున్నాం. మా మూవీ 14న రిలీజ్‌ అయితే 13న సాయంత్రం నుంచే అన్ని థియేటర్స్‌లో షోస్‌ వేస్తున్నాం’ అని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -