Wednesday, February 11, 2026
E-PAPER
Homeవరంగల్ఫిబ్రవరి 12న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతు.

ఫిబ్రవరి 12న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతు.

- Advertisement -

– జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ స్టీరింగ్ కమిటీ
నవతెలంగాణ –  భూపాలపల్లి : నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలనే డిమాండ్‌పై ఫిబ్రవరి 12న కార్మిక సంఘాలు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు, తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పక్షాన మద్దతునిస్తున్నామ‌ని, కేంద్ర ప్రభుత్వం అమెరికాకు లొంగిపోయి ఏకపక్షంగా అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చేసుకున్నది. వాణిజ్య ఒప్పంద ప్రకారం అమెరిక నుండి వ్యవసాయ ఉత్పత్తులు మన దేశం లో మార్కెట్ చేసుకోవడానికి దిగుమతి సుoఖాన్ని మన దేశం పూర్తిగా ఎత్తివేసింది. అమెరికాలో వ్యవసాయ రంగానికి 50 శాతం సబ్సిడీ ఇస్తున్నది మనదేశంలో వ్యవసాయ రంగానికి మన కేంద్ర ప్రభుత్వం 3 శాతమే ఇస్తున్నది. అమెరికాలో వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు చాలా తక్కువ మన దేశంలో వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు చాలా ఎక్కువ. కనుక అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను మనదేశంలో అమ్ముకోవడానికి దిగుమతి సుoఖాన్ని ఎత్తివేసింది. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు మనదేశంలో మార్కెట్ చేస్తే మన దేశ వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు రాక మన రైతాంగానికి ఆత్మహత్యలే శరణ్యం అవుతాయ‌ని తెలిపారు.

2021 సంవత్సరంలో రైతాంగ ఉద్యమం చేసి మూడు వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి దేశ రైతాంగం మూడు చట్టాలను రద్దు చేయించుకున్నది. కేంద్ర ప్రభుత్వం రైతాంగ సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తానని చెప్పి నేటికీ వాటిని పరిష్కారం చేయకుండా మరోసారి దేశ రైతుల అందరిని మోసం చేసిందని విమ‌ర్శించారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రైతాంగానికి గత సంవత్సరం బడ్జెట్ కంటే ఈసారి సబ్సిడీలు ఎత్తివేసింది. దీని ఫలితంగా ఎరువులు, పురుగు మందుల ధరలు పెరుగుతాయని అన్నారు.

ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 12వ తేదీన సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాలు, దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి . ఈ సమ్మెకు మద్దతుగా మా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పక్షాన సంపూర్ణ మద్దతు ను ప్రకటిస్తున్నాయి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ స్టీరింగ్ కమిటీ సభ్యులు తెలిపారు.
వారు సిహెచ్‌. అశోక్, బి. సేవా నాయక్, ఎన్‌. తిరుపతి, కె.కుమారస్వామి, జీ. జగపతిరావు, ఎ. తిరుపతి లు తెలిపారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -