నవతెలంగాణ-హైదరాబాద్: నోయిడా కార్మికుల ఆందోళనకు యూపీ ప్రభుత్వం దిగొచ్చింది.కార్మికులకు కనీస సగటు వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అన్ని స్థాయిల్లోని కార్మికులు ఇది వర్తిస్తుందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ సూచనలకు అనుగుణంగా వేతనాలు పెంచుతూ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయం తీసుకున్నట్లు మేధా రూపం తెలిపారు. వేతనాల పెంపు నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుందన్నారు. వేతనాలు పెంపు, కనీస హక్కుల కోసం నోయిడా కార్మిక వాడలోని ఫేజ్2లో కార్మికులు సోమవారం భారీ నిరసన ప్రదర్శన చేపట్టిన విషయం తెలిసిందే.
అన్ స్కిల్డ్ వర్కర్స్‌కు నెలకు కనీస వేతనం రూ.13,690గా నిర్ణయించారు. అంతకుముందు ఈ వేతనం రూ.11,313గా ఉండేది. సెమీ స్కిల్డ్ వర్కర్స్‌కు నెలకు రూ.15,059, స్కిల్డ్ వర్కర్స్‌కు రూ.16,868 అందిస్తారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అన్‌స్కిల్డ్ కార్మికులకు నెలకు రూ.13,006, సెమీ స్కిల్డ్ వర్కర్స్‌కు రూ.14,306, స్కిల్డ్ వర్కర్స్‌కు రూ.16,025 వేతనం అందిస్తారు.యూపీలోని మిగతా జిల్లాల్లో అన్‌స్కిల్డ్ కార్మికులకు నెలకు రూ.12,356, సెమీ స్కిల్డ్ వర్కర్స్‌కు రూ.13,591, స్కిల్డ్ వర్కర్స్‌కు రూ.15,224 వేతనం అందిస్తారు.



