Tuesday, April 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గంగారంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

గంగారంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
కాటారం మండలం గంగారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో మంగళవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ వీధుల్లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ ఆలోచనలు, సమానత్వ సందేశాలను ప్రజల్లోకి విస్తృతంగా చాటారు. యువత ఉత్సాహంతో నిర్వహించిన ఈ ర్యాలీ గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అనంతరం బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సభలో నాయకులు అంబేద్కర్ గారి సేవలను స్మరించుకుంటూ, ఆయన చూపిన మార్గంలోనే సమాజం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం, సమాన హక్కులు, విద్యాభివృద్ధి కోసం అంబేద్కర్ చేసిన కృషి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండం శోభారాణి, ఉపసర్పంచ్ ముల్కల నగేష్, గ్రామ కార్యదర్శి బీరెల్లి కర్ణాకర్ మాట్లాడుతూ… అంబేద్కర్ ఆలోచనలు ప్రతి ఇంటికీ చేరాల్సిన అవసరం ఉందని, యువత ఆయన సిద్ధాంతాలను ఆచరణలో పెట్టాలని సూచించారు.

అంబేద్కర్ సంఘం అధ్యక్షులు గద్దల మహేష్, ఉపాధ్యక్షులు రావుల లక్ష్మణ్, ఎస్.కె. షారుక్ ఖాన్, భూక్యా రాజ్ కుమార్, గౌరవ అధ్యక్షులు సేన సమ్మయ్య, చిట్యాల సమ్మయ్య, నీలాల సమ్మయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షులు గద్దల రమేష్, గ్రామ పెద్దలు చీర్ల తిరుపతి రెడ్డి, తిప్పల ప్రభాకర్ రెడ్డి, చైర్మన్ తోటపల్లి ప్రశాంత్, తాటిపాముల చంద్రమౌళి రెడ్డి తదితరులు సభలో పాల్గొన్నారు.

అలాగే జిల్లాల ఓదెలు యాదవ్, కనకం రాకేష్, నీలాల మహేష్, మంతెన వసంత్, మాదరి చరణ్, పప్పుల రామకృష్ణ, పుడుత తిరుపతి, షేక్ రహీం, చీపెల్లి చిన్ని, మార్పాక శ్రీనివాస్ తదితరులు పాల్గొని కార్యక్రమానికి మద్దతు తెలిపారు. గ్రామ వార్డు సభ్యులు, యువత పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -