నవతెలంగాణ – నవాబ్ పేట
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, ప్రపంచం వేధావి భీమ్రావు అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మండల కేంద్రముతో పాటు వివిధ గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో యువజన సంఘాల ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల కేంద్రము లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర సర్పంచ్ గీతారాణిసుధాకర్ చారి ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ సూచించిన విధంగా ఉండాలని తెలిపారు. రాజ్యంగ స్పూర్తితో ముందుకు సాగాలని సూచించారు. లింగంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్పంచ్ యాదగిరి, ఉపసర్పంచ్ పాండు, యువజన సంఘం నాయకులు బాలకిష్టయ్య, కృష్ణయ్య, నర్సింహులు, శాంతయ్య, సైదులు, నరేష్, ప్రకాశ్, లింగం, యాదయ్య, కృష్ణయ్య, ఇస్తారయ్య, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



