నవతెలంగాణ-హైదరాబాద్ : ఈ అక్షయ తృతీయ వేళ, మారుతున్న ధరలతో సంబంధం లేకుండా బంగారం కొనుగోలుదారులు ముందుగానే ప్రణాళిక చేసుకోవడాన్ని నగల వ్యాపారులు సులభతరం చేస్తున్నారు. భారతదేశపు అగ్రగామి క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ అయిన ఇన్‌స్టామార్ట్, కళ్యాణ్ జ్యువెలర్స్‌తో భాగస్వామ్యం చేసుకుని ‘గోల్డ్ రేట్ ప్రొటెక్షన్’ అనే ఒక వినూత్నమైన సదుపాయాన్ని అందిస్తోంది. దీని ద్వారా వినియోగదారులు నేటి బంగారం ధరను లాక్ చేసుకుని, అక్షయ తృతీయ రోజున, లాక్-ఇన్ ధర లేదా ఆ రోజు మార్కెట్ ధర – ఈ రెండింటిలో ఏది తక్కువగా ఉంటే ఆ ధరకు కొనుగోలు చేయవచ్చు.
సంపద మరియు శుభారంభాలకు ప్రతీక అయిన అక్షయ తృతీయ సమయంలో బంగారానికి ఎనలేని ప్రాముఖ్యత ఉంటుంది. పండుగకు ముందు వినియోగదారులు తమ కొనుగోళ్లకు ప్రణాళిక చేసుకునేటప్పుడు సౌలభ్యం, భరోసా రెండూ సమానంగా ముఖ్యమవుతాయి. కళ్యాణ్ జ్యువెలర్స్ నుండి బిఐఎస్ హాల్‌మార్క్ ఉన్న బంగారు నాణేలను ఆర్డర్ చేసే వినియోగదారులకు ఇన్‌స్టామార్ట్ యొక్క ‘గోల్డ్ రేట్ ప్రొటెక్షన్’ సదుపాయం సౌకర్యవంతంగా మరియు భరోసా కల్పించే రీతిలోనూ ఉంటుంది.
ఇది ఎలా పనిచేస్తుంది..?
2026 ఏప్రిల్ 10 నుండి ఏప్రిల్ 16 మధ్య, వినియోగదారులు ఇన్‌స్టామార్ట్ యాప్‌లో అర్హత కలిగిన కళ్యాణ్ జ్యువెలర్స్ బంగారు నాణేలను ఎంచుకుని, అక్షయ తృతీయ నాడు డెలివరీ పొందేందుకు గాను 0.5 గ్రాముల బంగారు నాణెం కోసం 5% అడ్వాన్స్, (రూ. 500 నుండి ప్రారంభమవుతుంది) చెల్లించి ముందుగా బుక్ చేసుకోవచ్చు. తద్వారా, ఏప్రిల్ 19న, ఉదయం 8:00 నుండి రాత్రి 12:00 గంటల మధ్య (భారతీయ కాలమానం), వారు ప్రీ-బుకింగ్ చేసిన రోజు నాటి బంగారు ధర లేదా డెలివరీ తేదీ నాటి ధర, ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ ధరకు తమ కొనుగోలును పూర్తి చేసుకోవచ్చు. ప్రీ-బుక్ చేసుకున్న వినియోగదారులందరికీ కళ్యాణ్ జ్యువెలర్స్ నుండి ఒక ఉచిత వెండి నాణెం కూడా లభిస్తుంది.
ఇన్‌స్టామార్ట్, వైస్ ప్రెసిడెంట్ గ్రోత్,అర్జున్ చౌదరి మాట్లాడుతూ “ఇన్‌స్టామార్ట్ వద్ద మేము, ధంతేరస్ సమయంలో 1 కేజీ వెండి బ్రిక్స్ డెలివరీ చేయడం నుండి రక్షాబంధన్ కోసం వెండి రాఖీలను పరిచయం చేయటం వరకు, ముఖ్యమైన సందర్భాలలో భారతీయులు విలువైన లోహాలను కొనుగోలు చేసే విధానంలో మేము నిరంతరం కొత్తదనాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము. పండుగ సమయంలో వినియోగదారులు బంగారం ధరలను మరింత విశ్వాసంతో అంచనా వేసుకోవడానికి సహాయపడేలా గోల్డ్ రేట్ ప్రొటెక్షన్ (బంగారం ధర రక్షణ) అనే ఫీచర్‌ను రూపొందించాము. వినియోగదారులు ముందుగానే ధరను ఖరారు చేసుకుంటూనే, ధరలు తగ్గినప్పుడు కూడా ప్రయోజనం పొందేలా చేయడం ద్వారా, మేము వారికి పూర్తి స్థాయిలో గొప్ప విలువను అందించడానికి కృషి చేస్తున్నాము. ఇది కేవలం సౌకర్యానికే పరిమితం కాకుండా, సాంస్కృతికంగా ప్రాముఖ్యత ఉన్న కొనుగోళ్లపై అర్థవంతమైన విలువను అందించే ఒక వేగవంతమైన వాణిజ్యం” అని అన్నారు.
కళ్యాణ్ జ్యువెలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ కళ్యాణరామన్ మాట్లాడుతూ, “కళ్యాణ్ జ్యువెలర్స్ రిటైల్ షోరూమ్లన్నింటిలోనూ ‘గోల్డ్ రేట్ ప్రొటెక్షన్’ ఒక ప్రాధాన్యత కలిగిన ఫీచర్‌గా ఉంది, ఇది పండుగ కొనుగోళ్లను ప్రణాళిక చేసుకునేటప్పుడు వినియోగదారులకు మరింత భరోసాను అందిస్తుంది. ఇన్స్టామార్ట్తో, మేము దీనిని మొట్టమొదటిసారిగా ఒక క్విక్ కామర్స్ వేదికకు విస్తరిస్తున్నాము. సంప్రదాయాలు మారుతున్న కొద్దీ, బంగారం కొనుగోలును అర్థవంతంగా మరియు అవాంతరాలు లేకుండా చేయటానికి మేము కట్టుబడి ఉన్నాము”అని అన్నారు.
గత సంవత్సరం, ధంతేరస్‌తో పోలిస్తే అక్షయ తృతీయ నాడు ఇన్‌స్టామార్ట్‌లో బంగారం , వెండి నాణేల అమ్మకాలు 500% పైగా పెరిగాయి. ఇది శుభప్రదమైన కొనుగోళ్లకు నమ్మకమైన మాధ్యమంగా క్విక్ కామర్స్ పట్ల భారతీయ వినియోగదారులలో పెరుగుతున్న ఆసక్తిని స్పష్టం చేస్తుంది.
నిత్యవసరాలకు మించి విస్తరించాలనే ఇన్‌స్టామార్ట్ యొక్క నిరంతర ప్రయత్నాలలో ఈ కార్యక్రమం తాజా ముందడుగు. ఇది, వినియోగదారులు ఆధారపడే వేగం , విశ్వాసంతో, అర్థవంతమైన, సందర్భోచితమైన కొనుగోళ్లకు ఒక ప్రధాన గమ్యస్థానంగా ఇన్‌స్టామార్ట్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోంది.
అన్ని బంగారు మరియు ఉచిత వెండి నాణేలు* బిఐఎస్ హాల్‌మార్క్ చేయబడిన, 24 క్యారెట్ల కళ్యాణ్ జ్యువెలర్స్ బంగారు నాణేలు. ఇవి లభ్యత* మరియు ఆఫర్ యొక్క నిబంధనలకు లోబడి ఉంటాయి.
*నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి
గోల్డ్ ప్రైస్ లాక్ అనేది ఇన్‌స్టామార్ట్‌లో జాబితా చేయబడిన, ఎంపిక చేసిన కళ్యాణ్ జ్యువెలర్స్ ఉత్పత్తులపై విక్రేత అందించే పరిమిత-కాల ఆఫర్. దీనికి ప్రైస్-లాక్ ఛార్జ్ అవసరం మరియు ఇది ఏప్రిల్ 19, 2026న ఉదయం 8:00 నుండి రాత్రి 12:00 గంటల (ఐఎస్ టి) మధ్య చేసిన తుది కొనుగోలుకు సర్దుబాటు చేయబడుతుంది. తుది ధర అనేది లాక్ చేయబడిన రేటు లేదా ఆ రోజున ఉన్న మార్కెట్ రేటులో ఏది తక్కువగా ఉంటే అదే అవుతుంది. కాంప్లిమెంటరీ వెండి నాణెంతో కూడిన ఈ ఆఫర్, లభ్యత మరియు అదనపు నిబంధనలు మరియు షరతులకు లోబడి ఉంటుంది.



