Tuesday, April 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్'టెక్నోవర్స్ హ్యాకథాన్ 2026'ను లాంచ్ చేసిన కాగ్నిజెంట్

‘టెక్నోవర్స్ హ్యాకథాన్ 2026’ను లాంచ్ చేసిన కాగ్నిజెంట్

- Advertisement -

~ జాతీయ స్థాయికి విస్తరించిన హ్యాకథాన్.. దేశవ్యాప్తంగా 400కి పైగా ఇంజనీరింగ్ కాలేజీల నుంచి 20 వేల మంది విద్యార్థుల భాగస్వామ్యం.

బెంగళూరు, 14 ఏప్రిల్ 2026: ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ (NASDAQ: CTSH).. ‘కాగ్నిజెంట్® టెక్నోవర్స్ హ్యాకథాన్ 2026’ను ఈరోజు లాంచ్ చేసింది. మూడవ ఎడిషన్‌లో అడుగుపెడుతున్న ఈ ఈవెంట్, ఇప్పుడు ప్రాంతీయ స్థాయి నుంచి జాతీయ స్థాయి ప్లాట్‌ఫారమ్‌గా ఎదిగింది. దేశవ్యాప్తంగా ఉన్న 400కు పైగా ఇంజనీరింగ్ కాలేజీల నుంచి 20,000 మందికి పైగా ప్రీ-ఫైనల్ ఇయర్ విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకురానుంది. వారు కలిసికట్టుగా పనిచేస్తూ, సరికొత్త ఆవిష్కరణలతో తమ ఏఐ-ఆధారిత ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌ను ప్రదర్శించేందుకు ఇది ఒక అద్భుతమైన వేదికగా నిలవనుంది.

“ప్రస్తుతం ఐటీ పరిశ్రమ అత్యంత కీలకమైన దశలో ఉంది. ఒక ఏఐ బిల్డర్‌గా, ఈ సాంకేతిక విప్లవాన్ని ముందుకు నడిపించే భవిష్యత్ తరాన్ని తీర్చిదిద్దేందుకు కాగ్నిజెంట్ కట్టుబడి ఉంది,” అని కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్ (గ్లోబల్ ఆపరేషన్స్) శ్రీ రాజేష్ వారియర్ తెలిపారు. “భారతదేశంలోని అత్యుత్తమ ఇంజనీరింగ్ విద్యార్థులు పరిశ్రమల్లోని వాస్తవ సవాళ్లను పరిష్కరించడానికి, ఎంటర్‌ప్రైజ్ స్థాయిలో ఆలోచించడానికి, భవిష్యత్తు టెక్నాలజీ లీడర్లుగా ఎదగడానికి ‘టెక్నోవర్స్ హ్యాకథాన్ 2026’ ఒక గొప్ప ప్లాట్‌ఫారమ్,” అని ఆయన స్పష్టం చేశారు.

కాలేజీలో నేర్చుకున్న అకడమిక్ చదువును, ప్రాక్టికల్ అప్లికేషన్స్‌తో జోడించడానికి ఈ హ్యాకథాన్ విద్యార్థులకు ఒక చక్కటి అవకాశం కల్పిస్తుంది. ఇందులో పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా సమస్యలను పరిష్కరించడం, కాగ్నిజెంట్ నిపుణులతో నేరుగా ఇంటరాక్ట్ అవ్వడం, కార్పొరేట్ సంస్థలు ఆవిష్కరణలను ఎలా చేస్తాయో ప్రాక్టికల్‌గా తెలుసుకునే అవకాశం లభిస్తుంది. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్, రిటైల్, మాన్యుఫ్యాక్చరింగ్, కమ్యూనికేషన్స్, మీడియా అండ్ టెక్నాలజీ, మరియు ఎనర్జీ అండ్ యుటిలిటీస్ వంటి కీలక రంగాలకు విద్యార్థులు తమ టెక్ పరిష్కారాలను రూపొందిస్తారు.

తమ ఇండియా ఆపరేషన్స్‌లో సమానత్వానికి పెద్దపీట వేస్తున్న కాగ్నిజెంట్.. ఈ హ్యాకథాన్‌లోనూ మహిళలకు 50 శాతం ప్రాతినిధ్యం కల్పిస్తోంది. ఈ పోటీలో పాల్గొనే ప్రతి కాలేజీ నుంచి నలుగురు సభ్యులతో కూడిన ఎన్ని జట్లైనా పోటీ పడొచ్చు. అయితే, ప్రతి జట్టులో కనీసం ఇద్దరు మహిళలు ఉండటం తప్పనిసరి. మే నెలలో ముగిసే ఈ హ్యాకథాన్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన టాప్-3 జట్లను విజేతలుగా ప్రకటిస్తారు. పూణేలోని కాగ్నిజెంట్ ఫెసిలిటీలో జరిగే సన్మాన కార్యక్రమంలో వీరికి అవార్డులు అందజేస్తారు.

జనరేటివ్ ఏఐతో సహా అత్యాధునిక టెక్నాలజీ నైపుణ్యాలను యువతకు అందించాలనే బృహత్తర లక్ష్యంలో భాగంగా.. కాగ్నిజెంట్ 2023లో ‘సినాప్స్’ అనే స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మందికి నైపుణ్య శిక్షణ అందించాలన్న లక్ష్యంతో మొదలైన ఈ కార్యక్రమం, 2026 డెడ్‌లైన్ కంటే ముందే ఆ టార్గెట్‌ను అధిగమించింది. ఇదే ఉత్సాహంతో, 2030 నాటికి ఏకంగా 20 లక్షల మందికి నైపుణ్య శిక్షణ అందించాలని కంపెనీ ఇప్పుడు సరికొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -