- Advertisement -
నవతెలంగాణ – ముధోల్
ముధోల్ సర్కిల్ పోలిస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు మహిళా కానిస్టేబుల్స్ తెలంగాణ రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి చేతుల మీదుగా మంగళవారం అవార్డు అందుకున్నారు. ముధోల్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న మహిళా కానిస్టేబులు ఎండి అశు, రాజమణి, తేజస్విని లకు పోలీస్ అక్క కార్యక్రమంలో భాగంగా విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు గానూ డిజీపీ చే అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా అవార్డు అందుకున్న మహిళా కానిస్టేబుల్ లకు ముధోల్ ఎస్ఐ బిట్ల పెర్సిస్, పోలిస్ సిబ్బంది అభినందించారు.
- Advertisement -


