Tuesday, April 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని కోన సముందర్ గ్రామంలో మంగళవారం స్థానిక సింగిల్ విండో కార్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ డైరెక్టర్ జైడి మధులత శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు తాము పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏ-గ్రేడ్ వరి ధాన్యానికి క్వింటాలకు రూ.2389, బి గ్రేడ్ వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.2369 మద్దతు ధర చెల్లించడం జరుగుతుందన్నారు.

తేమ 17 శాతానికి మించకుండా ఉండాలని అన్నారు. రైతులకు ఏమైనా అనుమానాలు ఉంటే విండో కార్యదర్శిని అడిగి తెలుసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో ప్రత్యేక అధికారి రమణ కుమార్, సర్పంచ్ బెజ్జారపు రాకేష్, మాజీ సింగిల్ విండో చైర్మన్ సామ బాపురెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి పొడెండ్ల సంజీవ్, సామ మహేందర్, సామ ప్రతాపరెడ్డి, చెంగల అశోక్, భలే రావు నర్సయ్య,విండో కార్యదర్శి కార్తీక్, విండో సిబ్బంది, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -