Wednesday, February 11, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికా-కెనడా బ్రిడ్జిని అడ్డుకుంటా

అమెరికా-కెనడా బ్రిడ్జిని అడ్డుకుంటా

- Advertisement -

ట్రంప్‌ బెదిరింపు
వాషింగ్టన్‌ :
తమకు తగిన గౌరవం ఇవ్వని పక్షంలో కెనడాతో అను సంధానించిన బ్రిడ్జిని ప్రారంభిం చేందుకు అనుమతించబోనని అమె రికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. కెనడాలోని ఆంటా రియో, అమెరికాలోని మిచిగాన్‌ రాష్ట్రాలను కలుపుతూ గోర్డీ హోవే అంతర్జాతీయ వంతెనను నిర్మిస్తు న్నారు. అయితే కెనడా తమ పట్ల న్యాయసమ్మతంగా వ్యవహరించి, తమకు తగిన గౌరవం ఇచ్చేంతవరకూ ఆ బ్రిడ్జిని తెరవనివ్వబోనని ట్రంప్‌ సోషల్‌ మీడియాలో స్పష్టం చేశారు. అయితే బ్రిడ్జి ప్రారంభోత్సవాన్ని ట్రంప్‌ ఎలా అడ్డుకుంటారో తెలియడం లేదు. దీనిపై తక్షణమే చర్చలు ప్రారంభమ వుతాయని మాత్రం ఆయన చెప్పారు. కానీ ఆ వివరాలేవీ తెలియజేయలేదు. ప్రాజెక్ట్‌ వెబ్‌సైట్‌ అందించిన సమా చారం ప్రకారం బ్రిడ్జి నిర్మాణానికి కెనడా ప్రభుత్వమే నిధులు సమ కూరుస్తోంది. డెట్రాయిట్‌ నదిపై నిర్మించిన ఈ బ్రిడ్జిని అనుమతులు, పరీక్షల అనంతరం ఈ ఏడాదిలోనే ప్రారంభించాల్సి ఉంది. 2018లోనే బ్రిడ్జి నిర్మాణం మొదలైనప్పటికీ గత దశాబ్ద కాలంగా దానిపై రెండు దేశాల మధ్య వివాదం నడుస్తోంది. బ్రిడ్జి నిర్మాణానికి 6.4 బిలియన్‌ డాలర్లు ఖర్చవుతాయని అంచనా. బ్రిడ్జిలో తమకు కూడా సమాన యాజమాన్య హక్కు కల్పించాలని ట్రంప్‌ డిమాండ్‌ చేస్తున్నారు. రెండు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య వివాదాన్ని ఆయన ప్రస్తావిస్తూ అమెరికా డెయిరీ ఉత్పత్తులపై కెనడా విధిస్తున్న సుంకం తమకు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని తెలిపారు. చైనాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం కెనడాను సర్వనాశనం చేస్తుందంటూ శాపనార్థాలు పెట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -