– మొదటి ఓటు… యువతలో ఉత్సాహం
నవతెలంగాణ-రాయికల్: రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రాయికల్ పట్టణంలో యువ ఓటర్ల ఉత్సాహం కనిపించింది. 11వ వార్డుకు చెందిన శ్రీరాముల భాను శ్రీ, కట్కం వర్ష హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా వచ్చి పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
భాను శ్రీ తొలిసారి తన ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదని పేర్కొంటూ,యువత తమ హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఎన్నికల ప్రక్రియలో యువత భాగస్వామ్యం పెరగడం ప్రజాస్వామ్యానికి బలమని అభిప్రాయపడ్డారు.
పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో కూడా యువ ఓటర్లు హాజరై ఉత్సాహంగా ఓటు వేశారు.మొదటి ఓటు వేయడం పట్ల యువతలో కనిపించిన ఆనందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.



