నవతెలంగాణ – దర్పల్లి
మండలంలోని హోన్నజీపేట గ్రామములో మంగళవారం గ్రామ సర్పంచ్ మద్దికుంట ఆశవ్వ అధ్యక్షతన అంబేద్కర్ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా ఎస్ఐ.వినయ్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళలు అర్పించారు. కార్యక్రమము అనంతరం గ్రామస్థులకు సమక్షంలో ఎస్సై వినయ్ ఆధ్వర్యంలో ఎర్రివ్ అలివే కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ సమాజంలో చట్టాల పట్ల గౌరవం, క్రమశిక్షణ, బాధ్యతాయుత ప్రవర్తన అవసరాన్ని అంబేద్కర్ గారి ఆలోచనల ద్వారా ప్రజలకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు క్రింది అంశాలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీటు బెల్ట్ ధరించాలని, అలాగే మద్యం సేవించి వాహనం నడపకూడదనే నిబంధనలు పాటిస్తూ, అధిక వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ ప్రమాదాలకు ప్రధాన కారణాలు అవుతున్నాయని అన్నారు.
ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు సూచికలను తప్పనిసరిగా ప్రతి ఒక్కరు తప్పకుండ పాతించాలని, అదేవిధంగా, యువతలో రోడ్డు భద్రతపై ప్రత్యేక చైతన్యం తీసుకురావడానికి వారికి మార్గదర్శకాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న వారందరితో రోడ్డు భద్రత నియమాలను కచ్చితంగా పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.ప్రతి పౌరుడు రోడ్డు భద్రత నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించి, సురక్షిత సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని గ్రామ యువత కు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్బంగా కార్యక్రమము అనంతరం గ్రామ సర్ప ఉప సర్పంచ్ సురేందర్ రెడ్డి, వార్డు సభ్యులు మద్ది కుంట రాఘవేందర్, గ్రామ యువకులు ఎస్ఐకు శాలువాతో ఘనంగా సన్మానించారు.



