నవతెలంగాణ – గోవిందరావుపేట
గొంది వంశీయుల ఇలావేల్పు ముయ్యాలమ్మ తల్లి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పెద్ద పండుగ మండలంలోని పసర గ్రామంలో మేడారం సమ్మక్క తల్లి మేన కోడలైన శ్రీ ముయ్యాలమ్మ తల్లి జాతర నేటి నుండి ప్రారంభం కానుంది. గత 80 సంవత్సరాల నుండి గొంది వంశీయులు ప్రతి రెండేళ్లకోసారి వచ్చే పెద్ద జాతరను గొంది వంశీయుల కుటుంబాలు, కుల పెద్దలు అంతా ఏకమై కుల దైవమైన ముయ్యాలమ్మ జాతరను పసర గ్రామంలో ఎంతో ఘనంగా గొంది వంశీయులు అంగరంగ వైభవంగా జాతరను జరుపుకుంటారు.పసర గ్రామంలో నివసిస్తున్న గొంది వంశీయుల అందరూ కలిసి వారి ఇలవేల్పు అయిన ముయ్యాలమ్మ తల్లి జాతరను గొంది నరసయ్య, ముద్దబోయిన రాము,గొంది రామచందర్,పాయం నారాయణ, మడి సాయిబాబా, గొంది రాజు, కుల పెద్దమనిషి గొంది రామచందర్లు, గొంది పొమ్మయ్య,గొంది ఎర్ర ముయన్న,గొంది కిరణ్, గొంది రాజేష్ ఈ ముఖ్యమైన కుటుంబాల ఆధ్వర్యంలో జాతరను నిర్వహిస్తుంటారు.
మీడియాతో ముయ్యాలమ్మ జాతర గొంది వంశీయుల కుల పెద్దమనిషి గొంది రామచందర్ మాట్లాడుతూ నెల11 బుధవారం రోజు నుండి మండే మెలుగుట,పాన్పు తెచ్చుట కార్యక్రమాన్ని సాయంత్రం నిర్వహించనున్నట్లు,12 న గురువారం ఉదయం వనం తెచ్చే కార్యక్రమం,సాయంత్రం గుట్ట నుండి అమ్మవారిని తీసుకొని వచ్చి గద్దెపై ప్రతిష్టింపజేయడం జరుగుతుందని,13 శుక్రవారం తల్లికి మొక్కులు చెల్లించే కార్యక్రమం ఉంటుందని ఆయన అన్నారు.తిరిగి14 న శనివారం తల్లిని వన ప్రవేశం చేయడం జరుగుతుందని వివరించినారు. ముయ్యాలమ్మ జాతర జరిగే సమయాన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన మండల ప్రజల్ని కోరినారు.ఈ కార్యక్రమంలో గొంది వంశీయులు,కుల పెద్దలు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



