నవతెలంగాణ-హైదరాబాద్: తృణమూల్ కాంగ్రెస్‌లో (TMC) తలెత్తిన అంతర్గత సంక్షోభం మరింత ముదిరింది. ఇప్పటికే బెంగాల్ అసెంబ్లీలో 61 మంది ఎమ్మెల్యేలు పార్టీ రెబల్ నేత రితబ్రతకు మద్దతు ఇవ్వడంతో శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఆయనను స్పీకర్ నియమించారు. కొన్ని గంటల ముందు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ తన రాజ్యసభ సభ్యత్వానికి సోమవారం రాజీనామా చేశారు. దీనికి కొనసాగింపుగా 20 మందికి పైగా టీఎంసీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు (Om Birla) లేఖ రాసినట్లు పార్టీవర్గాలు తెలిపాయి.బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేకు తనతో సహా సుమారు 20 మంది టీఎంసీ ఎంపీలు మద్దతు ఇవ్వనున్నట్లు ఆ పార్టీ లోక్‌సభ ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్ తెలిపారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు లేఖ సమర్పించామని చెప్పారు.
టీఎంసీలో ఆగని తిరుగుబాటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



