Tuesday, July 28, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయం150 ఏండ్ల తర్వాత స్పెయిన్ రాణిగా లియోనోర్‌

150 ఏండ్ల తర్వాత స్పెయిన్ రాణిగా లియోనోర్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : స్పెయిన్ రాజు ఫిలిప్, రాణి లెటిజియాల పెద్ద కుమార్తె యువరాణి లియోనోర్ చిన్న వయసులోనే ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. 13 ఏండ్లు వయసులో స్పెయిన్ రాజ్యాంగ వార్షికోత్సవంలో ఆమె చేసిన ఆత్మవిశ్వాసపూరిత ప్రసంగం ప్రశంసలు అందుకుంది. 12 ఏండ్లకే ప్రతిష్ఠాత్మక ‘ఆర్డర్ ఆఫ్ గోల్డెన్ ఫ్లీస్’ పురస్కారం అందుకున్నారు. 150 ఏండ్ల తర్వాత స్పెయిన్‌ను పాలించే తొలి రాణిగా చరిత్ర సృష్టించనున్నారు. త్రివిధ దళాల్లో శిక్షణ పొందుతున్న ఆమె స్పానిష్‌తో పాటు ఇంగ్లీష్, ఫ్రెంచ్, అరబిక్, మాండరిన్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. మహిళా సాధికారత, యువత అభివృద్ధికి ఆమె ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -