– టీయూసీఐ జిల్లా నాయకులు పాడ్య బీకు
నవతెలంగాణ -పెద్దవంగర: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ చట్టాలను వెంటనే రద్దు చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) మహబూబాబాద్ జిల్లా నాయకులు పాడ్య బీకు డిమాండ్ చేశారు. చిన్నవంగర గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కొత్త లేబర్ కోడ్స్ రద్దు డిమాండ్ తో తలపెట్టిన సమ్మెకు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను బుధవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కార్మికులు వందేళ్ల నుంచి పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులకు నష్టం కలిగించే కొత్త చట్టాలను తీసుకురావడం పెట్టుబడి వర్గాల ప్రయోజనాల కోసమేననని ఆరోపించారు. కార్మికులు 12 గంటలు పనిచేయాలని, వ్యవసాయ కార్మికులకు తీసుకువచ్చిన జీవోలను వెంటనే ఉపసంహరించాలని అన్నారు. మల్టీపర్సస్ విధానం రద్దుచేయాలని, జీవో నంబర్ 51ని సవరించాలని కోరారు. కొత్త లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు పిలుపు ఇచ్చామని, సమ్మెను జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోతే నిరవధిక సమ్మె చేయటానికి కూడా కార్మిక వర్గం సిద్ధపడాలని సూచించారు. లేబర్ కోడ్స్ ను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీయూసీఐ తొర్రూర్ ఏరియా కమిటీ కార్యదర్శి ఎండీ షరీఫ్, నాయకులు మధుకర్, యాకయ్య, వెంకన్న, పద్మ, మహేశ్వరి, సుజాత, ఏకలక్ష్మి, వెంకటమ్మ, స్వరూప, సరోజన, విజయ తదితరులు పాల్గొన్నారు.
లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



