Wednesday, February 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అన్నం పెట్టి రైతన్నకు యూరియా కష్టాలు

అన్నం పెట్టి రైతన్నకు యూరియా కష్టాలు

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట
రైతుకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం  నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఎంపీపీ సుడి శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ లకావత్ నరసింహ నాయక్ మాట్లాడుతూ రైతన్నను యూరియా కష్టం వెంటాడుతున్నది. పోయిన వానకాలం పడ్డ బాధలకన్నా ఈ యాసంగిలో రెట్టింపు అనుభవించాల్సి వస్తున్నది. అయితే, ఎరువుల దుకాణాల వద్ద రైతులు లైన్లో ఉండవద్దని, ఎప్పటికప్పుడు స్టాక్‌ వివరాలు తెలిసేలా, ముందే బుక్‌ చేసుకొని షాపులకు వెళ్తే ఇచ్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల  ఇటీవల ‘ఫర్టిలైజర్‌ మొబైల్‌ యాప్‌’ను తీసుకువచ్చింది. అవగాహన లేని ఈ యాప్ రైతుల పాలిటి  శాపమే గత పది ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వ ఉన్నప్పుడు కష్టాలంటే తెలువని రైతన్నలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కష్టాల సుడిగుండంలో రోజురోజుకు రైతన్న మునిగిపోతున్నాడు. అంతేకాదు ఇది నిరక్షరాస్యులు, ఆండ్రాయిడ్‌ ఫోన్లు లేని రైతులకు తీవ్ర కష్టాలు తీసుకొచ్చింది.

వాళ్లు తమ దగ్గర ఉన్న చిన్న ఫోన్లను పట్టుకొని ఫర్టిలైజర్‌ దుకాణానికి వెళ్తే బస్తాలు ఇవ్వలేని దుర్భర  పరిస్థితి ఉన్నది.ఇక ఫోన్లు ఉన్న రైతులు రోజుల తరబడి ఎన్నిసార్లు ప్రయత్నించినా ఒక్క బస్తా బుక్‌ కాకపోవడం, కొన్ని సందర్భాల్లో దుకాణాల్లో స్టాక్‌ ఉన్నా యాప్‌లో నోస్టాక్‌ కనిపించడం, ఒకవేళ బుక్‌ చేసుకున్న తర్వాత దుకాణాలకు వెళ్తే సర్వర్‌ సమస్యతో అక్కడే గంటలతరబడి వేచి ఉండాల్సి వస్తున్నది. ఎవుసం పనులు పక్కన పెట్టుకుని పొద్దంతా రైతులు ఫోన్‌ చేతిలో పట్టుకుని కూర్చున్నా ఫలితం లేకుండా పోతున్నది. యాప్‌లో స్టాకు ఉందని బుక్‌ చేద్దాం అనే వరకే నో స్టాక్‌ అని చూపిస్తున్నది. ఒక వేళ బస్తాలు బుక్‌ చేసుకుని మరుసటి రోజున సంబంధిత ఎరువుల దుకాణానికి వెళ్తే అక్కడ సర్వర్‌ రాకపోవడంతో పొద్దంతా వేచి చూడాల్సి వస్తుంది రైతన్న కష్టం..కౌలు రైతులు వీరు కష్టాలు ఇక చెప్పనక్కనే లేదు తీవ్ర కష్టం

 రైతులు తమ భూములను కౌలుకు ఇస్తుంటారు. యాప్‌ వల్ల ఆ భూములను సాగు చేస్తున్న కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. నిబంధనల ప్రకారం భూమి యజయానులే యాప్‌లో యూరియా బుక్‌ చేయాలి. కానీ ఐడీ నంబర్‌ షాపులో చెబితే యూరియా బస్తాలు ఇస్తారు. ఎక్కడో ఉన్న యజమానులు కౌలు రైతుల కోసం బుక్‌ చేసి, ఐడీ నంబర్‌ చెప్పే పరిస్థితి లేనందున వారికి యూరియా పొందలేని పరిస్థితి వచ్చింది. నిబంధనల ప్రకారం చూస్తే యూరియాను యాప్‌ ద్వారా బుక్‌ చేసుకునే అవకాశం ఎక్కువలో ఎక్కువగా 60శాతం మందికే సాధ్యమవుతుంది. నిరక్షరాస్యులు, అండ్రాయిడ్‌ ఫోన్‌ లేని రైతులు, కౌలు రైతులు బుక్‌ చేసుకునే వీలు లేదని, నిబంధనలు సడలిస్తే బాగుంటుందనే బి ఆర్ఎస్ పార్టీ డిమాండ్‌ చేస్తుంది.గత కెసిఆర్ ప్రభుత్వంలో   ఎప్పుడు ఇలాంటి ఇబ్బందులు కలుగలేదు. ఇప్పుడు యూరియా బస్తాల కోసం ఇలాంటివి పెడితే చాలా ఇబ్బందులు పడుతున్న రైతన్నలను ఇకనైనా ప్రభుత్వము ఆలోచన చేసి సరైన నిర్ణయాలు తీసుకొని అవగాహన గల వ్యాపాలను తీసుకొచ్చి రైతన్నలకు మేలు చేసే విధంగా ప్రభుత్వ ప్రణాళికలు ఉండాలని  బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం ఉన్నారు. ఈ కార్యక్రమంలో  బి ఆర్ ఎస్ పార్టీ మండల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -