Thursday, February 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅద్భుతమైన ప్రేమకథ

అద్భుతమైన ప్రేమకథ

- Advertisement -

సౌమిత్‌ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం ‘నిలవే’. శ్రేయాసి సేన్‌ నాయికగా పరిచయం అవుతున్నారు. హర్ష చెముడు, సుప్రియా ఐసోలా మరో జంటగా నటించారు. పీఓవి ఆర్ట్స్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రాజ్‌ అల్లాడ, గిరిధర్‌ రావు పోలాడి, సాయి కే వెన్నం నిర్మించారు. ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం కానుకగా ఈనెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం మేకర్స్‌ ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాయని సునీత ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ వేడుకలో ట్రైలర్‌ను ప్రదర్శించారు.

హీరో సౌమిత్‌ పోలాడి మాట్లాడుతూ, ‘నన్ను హీరో, దర్శకుడిగా మార్చింది సాయి కే వెన్నం. మెగాస్టార్‌ చిరంజీవి స్ఫూర్తితో నటుడిని అయ్యాను. ఈ నెల 13న నా తొలి సినిమా విడుదలకాబోతుంది. నిన్న ప్రీమియర్‌ వేశాం. అందరూ చాలా బాగుందని అభినందించారు. రేపు ప్రేక్షకులు కూడా ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. యాక్షన్‌ మూవీస్‌లో కె.జి.ఎఫ్‌. ఎలా ఉందో, లవ్‌ స్టోరీస్‌లో మా సినిమా కే జీ ఎఫ్‌లాంటిది’ అని తెలిపారు.

చిత్ర దర్శకుడు సాయి కే వెన్నం మాట్లాడుతూ, ‘నాని ‘కోర్ట్‌’ సినిమా తీశాక చూడండి నచ్చకపోతే నా తదుపరి సినిమా చూడకండి అంటూ బెట్‌ వేశారు. కానీ మా దగ్గర అలాంటి బెట్స్‌ లేవు. మా దగ్గర మంచి సినిమా ఉంది. దాన్ని మీరు చూసి ఆశీర్వదించండి’ అని తెలిపారు. ‘ప్రీమియర్‌ వేశాం. మంచి స్పందన వచ్చింది. చక్కటి మ్యూజికల్‌ లవ్‌ స్టోరీ. కొత్తవారైనా అందరూ బాగా నటించారు. హీరో కమ్‌ దర్శకుడు కూడా పాత్రలో లీనమై మురిపించాడు’ అని నిర్మాత రాజ్‌ అల్లాడ చెప్పారు. ఈ వేడుకలో నిర్మాత మాధురి, నటి సత్య శ్రీ, ఆర్‌ అండ్‌ ఎ ట్రావెల్స్‌ అనురాధా, ప్రవీణ కడియాల, ప్రొడ్యూసర్‌ గిరిధర్‌ రావు, నటుడు రూపేష్‌ తదితరులు పాల్గొని బిగ్గెస్ట్‌ మ్యూజికల్‌ లవ్‌ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిన ఈ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -