Tuesday, June 9, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇజ్రాయెల్‌కు ట్రంప్ హెచ్చరిక..!

ఇజ్రాయెల్‌కు ట్రంప్ హెచ్చరిక..!

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : ఇరాన్‌పై నిరంతరం దాడులు చేస్తూ ఉద్రిక్తతలు పెంచితే అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ ఒంటరిగా మిగిలిపోయే ప్రమాదం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో జరిపిన ఫోన్ సంభాషణల్లో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి వాషింగ్టన్ ప్రయత్నిస్తున్న తరుణంలో, ఇజ్రాయెల్ జరుపుతున్న సైనిక దాడులు అమెరికా వ్యూహాలకు అడ్డంకిగా మారడమే ఈ హెచ్చరికకు ప్రధాన కారణం.

గత వారాంతంలో లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతీకారంగా.. ఇరాన్ దాదాపు 30 బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్‌పైకి ప్రయోగించింది. దీనికి బదులుగా ఇజ్రాయెల్ కూడా ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, పెట్రోకెమికల్ కేంద్రాలపై దాడులు చేసింది. అయితే, ట్రంప్ జోక్యంతో ఇరుదేశాలు ప్రస్తుతానికి దాడులను నిలిపివేశాయి. ఇరాన్‌పై మరింత పెద్ద ఎత్తున దాడులు చేయాలన్న నెతన్యాహు ప్రణాళికను.. ట్రంప్ జోక్యం చేసుకుని విరమింపజేశారు.

“బీబీ (నెతన్యాహు), నువ్వు జాగ్రత్తగా ఉండాలి.. లేకపోతే త్వరలోనే నువ్వు ఒంటరిగా పోరాడాల్సి వస్తుంది” అని తాను హెచ్చరించినట్లు ట్రంప్ స్వయంగా వెల్లడించారు. ఇరుపక్షాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నందున ఇక యుద్ధాన్ని ఆపాలని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు నెతన్యాహు మాత్రం తమ సరిహద్దు రక్షణ కోసం, ఇరాన్ అణు సామర్థ్యాన్ని దెబ్బతీయడానికి ఈ దాడులు తప్పనిసరని సమర్థించుకున్నారు. అమెరికా రక్షణ దళాలు ఇరాన్ క్షిపణులను అడ్డుకోవడంలో సహాయపడినప్పటికీ, ఇజ్రాయెల్ చేస్తున్న ఎదురు దాడుల్లో మాత్రం నేరుగా పాల్గొనలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -