– బడిబాట కార్యక్రమంలో సర్పంచ్ గునిగంటి కమలాకర్
నవతెలంగాణ చిన్నగూడూరు : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచి, విద్యాభివృద్ధికి తోడ్పడాలని గుండంరాజుపల్లి సర్పంచ్ గునిగంటి కమలాకర్ పిలుపునిచ్చారు. సోమవారం గ్రామంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఆయన ఉపసర్పంచ్ చిలువేరు శైలజ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులను కలుసుకుని ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రతి చిన్నారి తప్పనిసరిగా పాఠశాలలో చేరి విద్యను అభ్యసించేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. సర్పంచ్ గునిగంటి కమలాకర్ మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తుకు విద్యే బలమైన పునాదని, గ్రామంలోని ప్రతి బాలబాలిక విద్యకు దూరం కాకుండా చూడడం అందరి బాధ్యత అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పంచాయతీ సెక్రటరీ అశోక్ వార్డ్ నెంబర్లు గారు అంగన్వాడీ ఉపాధ్యాయులు ఆశా వర్కర్స్ మహిళా సంఘాలు గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అందరూ సహకరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



