Thursday, February 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాజోలి మండలంలో ఆగని అక్రమ ఇసుక రవాణా

రాజోలి మండలంలో ఆగని అక్రమ ఇసుక రవాణా

- Advertisement -

నవతెలంగాణ- రాజోలి : జోగులాంబ గద్వాల జిల్లాలోని రాజోలి మండలంలో గత కొన్ని నెలలుగా అక్రమ ఇసుక రవాణా జోరుగా నడుస్తుంది. అక్రమ ఇసుక రవాణా పట్ల సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నాడంతో స్థానిక ప్రజల్లో అధికారులపై అనేక సందేహాలు వెలువెత్తుతున్నాయి. రాజోలి మండలం మాన్ దొడ్డి గ్రామంలో మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ అక్రమ ఇసుక కాసర్లు ఇసుకను అమ్ముకొని  ప్రభుత్వాదాయానికి గండి వేస్తున్న అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని స్థానిక ప్రజలు అధికారులపై మండిపడుతున్నారు.

మాన్ దొడ్డి సరిహద్దున ఉన్నటువంటి తుంగభద్ర నదిలోకి అక్రమంగా రాత్రి వేళలో దిగి ట్రాక్టర్లతో నది ఒడ్డున అక్కడ ఇసుక డంపులను ఏర్పాటు చేసి పగటి సమయంలో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న ఏ అధికారి వచ్చి ఆ పని పరిస్థితి నెలకొంటుంది. ఇది ఇలాగే కొనసాగితే  ఇంకొంతమంది అప్రమస్కాసార్లు పుట్టుకొచ్చే అవకాశం ఉందని మాన్ దొడ్డి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా అక్రమ వేసుకోసులపై చర్యలు తీసుకొని అక్రమ ఇసుక రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలని దొడ్డి గ్రామస్తులు అధికారులను వేడుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -