Tuesday, June 9, 2026
E-PAPER
Homeహైదరాబాద్భారీ వ‌ర్షాలు..కూలిన చెట్టు

భారీ వ‌ర్షాలు..కూలిన చెట్టు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: నైరుతి ప‌వ‌నాల రాక‌తో రాష్ట్రంలో వానాలు ఊపందుకున్నాయి. ఉద‌యం నుంచి ఎండ‌ల‌తో అల్లాడిపోయిన జ‌నాల‌కు వ‌ర్షాలు ఉప‌శ‌మ‌నం క‌లిగించాయి. భారీ వ‌ర్షంతోపాటు ప‌లు చోట్ల ఈదురు గాలులు బీభ‌త్సం సృష్టించాయి. గాలుల ధాటికి పలు చోట్ల చెట్లు నేల‌కులాయి. హైద‌రాబాద్‌లోని ఆర్టీసీ క‌ళ్యాణ మండ‌పం స‌మీపంలో చెట్టు కొమ్ము విరిగి రోడ్డుగా అడ్డంగా ప‌డిపోయింది.అదే విధంగా వీఎస్టీ సింగిల్ మార్గంలో భారీ వృక్షం నేల‌కూలింది. దీంతో ఆయా మార్గంలో రాక‌పోక‌ల‌కు అంత‌రాయం ఏర్ప‌డింది.. గంట‌కు పైగా కురిసిన వ‌ర్షానికి న‌గ‌రంలో రోడ్లు జ‌ల‌మ‌యమైయ్యాయి. డ్రైనేజీలు ఉప్పొంగాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన జీహెచ్ ఎంసీ అధికారులు స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -