Saturday, August 8, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహైదరాబాద్‌లో వైన్ షాపులు బంద్

హైదరాబాద్‌లో వైన్ షాపులు బంద్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : బోనాల పండుగ సందర్భంగా ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పేందుకు, హైదరాబాద్‌లోని సైబరాబాద్ పరిధిలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వైన్ షాపులు, కల్లు కాంపౌండ్లు, బార్లను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. కూకట్‌పల్లి, అల్లాపూర్, రాయదుర్గం, జీడిమెట్ల, మేడ్చల్, చందానగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. అయితే, స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్బులలోని బార్లకు ఈ మూసివేత నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -