Tuesday, June 9, 2026
E-PAPER
Homeజిల్లాలుబాల్య వివాహం చట్టరీత్యా నేరం

బాల్య వివాహం చట్టరీత్యా నేరం

- Advertisement -

బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్
నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండలంలోని లింబూర్ గ్రామంలో నాగమణి-శివాజీల కుమార్తె (16)కు (బాల్య వివాహం) నిశ్చయమైంది. గ్రామస్థుల ద్వారా సమాచారం అందుకున్న తహశీల్దార్ రంజిత్ కుమార్, ఎంపీడీవో జగదీష్, ఐసిడిఎస్ సీడీపీఓ కళావతి, ఆర్ఐ సాయిబాబా, డోంగ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు శ్రీలేఖ, కార్యదర్శి, మంగళవారం లింబూరు గ్రామానికి హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. అనంతరం బాలిక తల్లిదండ్రులకు, వారి బంధువులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రస్తుతం వెంటనే పెళ్లి పనులు ఆపేయాలని, బాల్య వివాహం చట్టరీత్యా నేరమని చెప్పారు. అమ్మాయికి 18 ఏండ్లు నిండిన తర్వాతే వివాహం జరిపించాలని సూచించారు. కాదని స్వతహాగా మీరు గానీ, బంధువుల ప్రోద్భలంతో గానీ బాల్య వివాహం జరిపిస్తే జైలు జీవితం తప్పదని హెచ్చరించారు. ఈ గ్రామంలోనే కాదు.. మిగతా ఊర్లలో కూడా 18 ఏండ్లలోపు బాలికలకు ఎక్కడైనా జరిపిస్తున్నట్టు తెలిస్తే వెంటనే మాకు సమాచారం అందించాలని కోరారు. అనంతరం బాలిక తలిదండ్రులు స్పందిస్తూ.. అధికారుల సూచనలు పాటిస్తామని, 18 ఏండ్లు పూర్తిగా నిండిన తర్వాతే వివాహం చేస్తామని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -