నవతెలంగాణ – హైదరాబాద్ : టీ20 ప్రపంచకప్‌లో ఒమన్‌పై శ్రీలంక 105 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన ఒమన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 225 పరుగుల భారీ స్కోర్ చేసింది. శ్రీలంక బ్యాటర్లలో కుశాల్ మెండిస్ ( 61; 45 బంతుల్లో 7 ఫోర్లు), పవన్ రత్నాయకే (60; 28 బంతుల్లో, 8 ఫోర్లు, 1 సిక్స్), డాసున్ శనక ( 50; 20 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) హాఫ్‌సెంచరీలతో ఆకట్టుకున్నారు. కేవలం 19 బంతుల్లోనే డాసున్ శనక అర్ధశతకం బాదాడు.
అయితే ఆ వెంటనే అతడు భారీ షాట్ ఆడే ప్రయత్నంలో పెవిలియన్‌కు చేరాడు. ఓపెనర్లు పాతుమ్ నిస్సాంక (13), కమిల్ మిషార (8) బ్యాటింగ్‌లో విఫలమయ్యారు. చివరల్లో కమిందు మెండిస్ 7 బంతుల్లో 19* పరుగులు సాధించాడు. ఒమన్ బౌలర్లలో జితేన్ రామానంది 2, జే ఒడెద్రా, సుఫ్యాన్ మెహమూద్ తలో వికెట్ తీసుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఒమన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 120 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టులో నదీమ్ (53*) హాఫ్ సెంచరీ చేశాడు. శ్రీలంక బౌలర్లలో చమీరా 2, తీక్షణ 2, వెల్లలాగె, హేమంత, మెండిస్ తలో వికెట్ తీశారు.



