ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్..
నవతెలంగాణ – ముధోల్
గ్రామాల అభివృద్ధి కి పెద్ద పీట వేస్తున్నాని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులకు గురువారం ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించారు. ఆనంతరం ఆయన మాట్లాడారు.మండలంలోని రూ.1 కోటి 37 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టటం జరిగిందన్నారు.
రామ్‌టెక్ గ్రామంలో వీవో భవనం, సీసీ రోడ్డు నిర్మాణానికి, మచ్కల్ గ్రామంలో వీవో భవనం, సీసీ రోడ్డు పనులకు, ముద్గల్ గ్రామంలో వీవో భవనం ,సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. అలాగే సరస్వతినగర్ గ్రామంలో అంగన్‌వాడి భవనం, సీసీ రోడ్డు నిర్మాణానికి, బోరేగాం గ్రామంలో వీవో భవనం నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.
చింతకుంట గ్రామంలో పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి, చింతకుంట తండాలో అంగన్‌వాడి భవన నిర్మాణానికి కూడా శంకుస్థాపనలు చేశారు. ఈ అభివృద్ధి పనులతో గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపడి ప్రజలకు మరింత సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లవ కుమార్,ఎంపివో చంద్రశేఖర్ ఏపిఎం గురు చరణ్, ఏపీవో శిరీష రెడ్డి ఆయగ్రామాల సర్పంచులు గంగాధర్, ఆత్మస్వరుప్, అనురాధ గణపతి, లక్ష్మి గంగాధర్, కల్లేడ కిష్టయ్య,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.



