Sunday, September 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమోహన్‌ నాయక్‌కు 14 రోజుల రిమాండ్‌

మోహన్‌ నాయక్‌కు 14 రోజుల రిమాండ్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: రహదారులు, భవనాల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మోహన్‌నాయక్‌ను ఏసీబీ అధికారులు కోర్టులో హాజరు పర్చారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మోహన్‌ నాయక్‌ అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ బృందాలు మంగళవారం ఏకకాలంలో 16 ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో అవినీతి విశ్వరూపం బహిర్గతమైంది. మొత్తంగా రూ.17.94 కోట్ల ఆదాయానికి మించిన ఆస్తుల్ని గుర్తించిన అనిశా.. మోహన్‌నాయక్‌ను అరెస్ట్‌ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -