- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : భారత రక్షణ శాఖ దేశీయంగా అభివృద్ధి చేసిన రుద్రం-2 యాంటీ-రేడియేషన్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి శత్రువుల రాడార్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను గుర్తించి ధ్వంసం చేయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. ఇది 300-350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను మాక్ 5.5 వేగంతో ఛేదించగలదు. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్‌కు ఇది పెద్ద సవాలుగా మారింది. ఈ పరీక్ష భారత్ వైమానిక దళం యొక్క ఆపరేషనల్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, శత్రువులపై వ్యూహాత్మక ఒత్తిడిని పెంచుతుంది.
- Advertisement -



