- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ ఆదివాసీల హక్కుల పరిరక్షణ, ఐదో షెడ్యూల్ ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల రాజ్యాంగబద్ధ రక్షణల అమలు వంటి వివిధ సమస్యలపై అఖిల భారత ఆదివాసీ సమన్వయ కమిటీ ప్రతినిధి బృందం జూన్ 11న ఉదయం 11 గంటలకు రాష్ట్ర గవర్నర్‌తో సమావేశం కానుంది. ఈ భేటీలో మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర, కమిటీ సలహాదారు, మాజీ డీజీపీ డాక్టర్ జె. పూర్ణచందర్రావు, గోండులు, కోయలు పాల్గొంటారు. ఆదివాసీల భూమి, అటవీ హక్కులు, స్వయం పరిపాలన, విద్య, ఉపాధి వంటి అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు.
- Advertisement -



