Friday, February 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహాయిగా నవ్వుతూనే ఉంటారు

హాయిగా నవ్వుతూనే ఉంటారు

- Advertisement -

హీరో విశ్వక్‌ సేన్‌, దర్శకుడు కె.వి.అనుదీప్‌ కలయికలో వస్తున్న చిత్రం ‘ఫంకీ’. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఒకరోజు ముందుగా నేడు (శుక్రవారం) థియేటర్లలో రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ప్రీ రిలీజ్‌ ప్రెస్‌ మీట్‌ను నిర్వహించింది. విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ, ‘భీమ్స్‌ అద్భుతమైన సంగీతం అందించారు. మామూలుగా నా సినిమాల్లో పాటలు బాగుంటాయి అంటారు. అయితే నా గత రెండు చిత్రాలలో పాటలు ఆశించిన స్థాయిలో మెప్పించలేదు.

ఇప్పుడు ఈ సినిమాకి భీమ్స్‌ అన్నీ మంచి పాటలు ఇచ్చారు. సినిమా విడుదల తర్వాత పాటలకు ఆదరణ ఇంకా పెరుగుతుందనే నమ్మకం ఉంది. స్నేహితులు, కుటుంబం సభ్యులతో కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేయండి. రెండు గంటలు ఎలా అయిపోయాయో కూడా తెలియనంతగా సినిమా మీకు వినోదాన్ని పంచుతుంది’ అని అన్నారు. ‘ఈ సినిమా ఎలా ఉండబోతుందో ఇప్పటికే మీ అందరికీ అర్థమైపోయింది. మా సినిమాని మీకు చూపించడం కోసం ఎంతో ఆసక్తికగా ఎదురుచూస్తున్నాము. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన నిర్మాత నాగవంశీకి కృతఙ్ఞతలు. దర్శకుడు అనుదీప్‌తో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. నా కెరీర్‌లో మొదటి కామెడీ సినిమా. ఈ చిత్రం మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని కథానాయిక కయాదు లోహర్‌ చెప్పారు.

దర్శకుడు అనుదీప్‌ కె.వి. మాట్లాడుతూ, ‘ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. మీరు కుటుంబంతో కలిసి సినిమాను ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. ‘సినీ నేపథ్యంలో జరిగే కథ ఇది. అలా అని సీరియస్‌గా ఉండదు. దర్శకుడికి, నిర్మాత కూతురికి మధ్య జరిగే సరదా కథ ఇది. క్యూట్‌ కామెడీ ఫిల్మ్‌. ప్రతి సన్నివేశం హాయిగా నవ్వుకునేలా ఉంటుంది. సినిమా చూస్తున్నంతసేపు రెండు గంటల పాటు మీ ముఖంలో నవ్వు ఉంటుంది. నవ్వుకోడానికి థియేటర్‌కి రండి. మీరు అసలు నిరాశ చెందరు. నవ్వుతూ థియేటర్‌ నుండి బయటకు వస్తారు’ అని నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పారు. నరేష్‌, వీటీవీ గణేష్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి దర్శకత్వం: అనుదీప్‌ కె.వి., నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, కూర్పు: నవీన్‌ నూలి, ఛాయాగ్రహణం: సురేష్‌ సారంగం, రచన: అనుదీప్‌ కె.వి, మోహన్‌, కళా దర్శకుడు: జానీ షేక్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -