Wednesday, April 15, 2026
E-PAPER
Homeసినిమారాజమహేంద్రవరంలో కొత్త షెడ్యూల్‌

రాజమహేంద్రవరంలో కొత్త షెడ్యూల్‌

- Advertisement -

ఈ ఏడాది వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో శర్వానంద్‌ ‘భోగి’ చిత్రంతో హ్యాట్రిక్‌ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పాన్‌-ఇండియా పీరియడ్‌ యాక్షన్‌ డ్రామా కోసం శర్వానంద్‌, దర్శకుడు సంపత్‌ నంది తొలిసారిగా చేతులు కలిపారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామోహన్‌ సమర్పిస్తున్నారు. ఇది శర్వానంద్‌ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటిగా రూపుదిద్దుకుంటోంది. ఫస్ట్‌-లుక్‌ విడుదలకు లభించిన అద్భుత స్పందన నేపథ్యంలో చిత్ర బృందం ఇప్పుడు రాజమండ్రిలో అత్యంత కీలకమైన, లెన్తీ షెడ్యూల్‌ను ప్రారంభించింది. చిత్రీకరణ రంపచోడవరం అడవులలోని కఠినమైన, సవాలుతో కూడిన ప్రదేశాలలో జరగనుంది. ఈ సన్నివేశాలను యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ ధిలీప్‌ సుబ్బరాయన్‌ పర్యవేక్షణలో చిత్రీకరిస్తున్నారు. ఇవి ప్రేక్షకులను లీనమయ్యేలా చేసే యాక్షన్‌ అనుభూతిని అందించనునాయి. ప్రధాన తారాగణంతో పాటు శర్వానంద్‌ కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. ఇది సినిమా నిర్మాణంలో ఒక కీలక ఘట్టంగా నిలుస్తోంది.
‘ఎ బ్లడ్‌ ఫెస్ట్‌’ అనే ఆకట్టుకునే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్‌ ఒక సరికొత్త అవతార్‌ లో కనిపిస్తున్నారు. దర్శకుడు సంపత్‌ నంది 1960లో ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వాస్తవికమైన కథనం,పవర్‌ ఫుల్‌ నేపథ్యంతో ఈ చిత్రం ఇంటెన్స్‌ డ్రామాతో గొప్ప ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వనుంది. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్‌, డింపుల్‌ హయాతి కథానాయికలుగా నటిస్తున్నారు.
రక్షా బంధన్‌ పండుగ సందర్భంగా ఆగస్ట్‌ 28న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా ఈ సినిమా థియేటర్‌లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: సంపత్‌ నంది, నిర్మాత: కేకే రాధామోహన్‌, సమర్పణ: లక్ష్మీ రాధామోహన్‌, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, డీఓపీ : కిషోర్‌ కుమార్‌ ఆరోకియా, ఆర్ట్‌ డైరెక్టర్‌: కిరణ్‌ కుమార్‌ మన్నె, స్టంట్స్‌: దిలీప్‌ సుబ్బరాయన్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -