నవతెలంగాణ-ముదిగొండ: ముదిగొండ మండలం వెంకటాపురంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా 25వ మహాసభకు హాజరైన సిపిఐ(ఎం) కేంద్రకమిటి సభ్యులు తమ్మినేని వీరభద్రం మాట్లాడారు. రేవంత్ రెడ్డి పథకాలు పెద్దలకు ఉపయోగపడేవే తప్ప పేదలకు ఉపయోగపడేవి కావని సిపిఐ(ఎం) కేంద్రకమిటి సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. ముదిగొండ మండలం వెంకటాపురం లో ఏర్పాటు చేసిన వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా 25వ మహాసభకు హాజరైన సిపిఐ(ఎం) కేంద్రకమిటి సభ్యులు తమ్మినేని వీరభద్రం మాట్లాడారు.
రేవంత్ రెడ్డి తాను హిట్లర్ లాంటి వాణ్ణి అని చెపుతున్నాడని,హిట్లర్ను ప్రపంచంలో అందరూ వ్యతిరేకిస్తున్నారని తెలియజేశారు. కేంద్రంలో,రాష్ట్రంలో ప్రజావ్యతిరేకత ప్రభుత్వాలు నడుస్తున్నాయని ఆరోపించారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హిందువులు, ముస్లింల గురించి మాట్లాడుతోంది.రాజకీయాల కోసం వాళ్ళ మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎంతో మంది నీట్ పరీక్ష కష్టపడి రాస్తే పేపర్ లీక్ చేశారని విమర్శించారు.విమర్శించే వాళ్లపై మోడీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు.



