Friday, February 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబీసీల జీవన ప్రమాణాలు పెంచేలా బడ్జెట్‌ ప్రతిపాదనలు

బీసీల జీవన ప్రమాణాలు పెంచేలా బడ్జెట్‌ ప్రతిపాదనలు

- Advertisement -

విజన్‌-2047కు అనుగుణంగా రవాణా, ఆర్టీసీ కార్యాచరణ : మంత్రి పొన్నం ప్రభాకర్‌
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

రాష్ట్రంలో బీసీ జీవన ప్రమాణాలు పెరిగేలా బడ్జెట్‌ కేటాయింపులు చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం 2047 లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. గురువారం 2025-26 బడ్జెట్‌లో కేటాయింపులు , విడుదలైన నిధులు, చేసిన ఖర్చులు ఇంకా పెండింగ్‌లో ఉన్న అంశాలపై మంత్రి ఉన్నాధికారులతో వేర్వేరుగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖలో 2025-26లో బడ్జెట్‌ కేటాయింపులు నిధుల విడుదల, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు , బీసీ హాస్టల్‌ నిర్వహణ , స్టడీ సర్కిళ్లలో శిక్షణ , బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్కిల్‌ డెవలప్‌మెంటు, కళ్యాణలక్ష్మి, రజక , నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్‌ , కాటమయ్య రక్షణ కవచాలు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రస్తుతం నడుస్తున్న పథకాలకు నిధుల విడుదలలో ఇబ్బందుల్లేవనీ, సక్రమంగా లబ్ధిదారులకు పథకాల ప్రయోజనాలు అందేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.

2026-27 బడ్జెట్‌ లో చేర్చాల్సిన అంశాలు ,ప్రతిపాదనలపై అధికారులకు పలు సూచనలు చేశారు. బలహీన వర్గాలకు జీవన ప్రమాణాలు ఆర్థిక వృద్ధి సాధించేలా బడ్జెట్‌లో ప్రతిపాదనలు పెట్టాలని డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో జరుగుతున్న బడ్జెట్‌ సన్నాహక సమావేశంలో ఈ అంశాలపై చర్చించాలని అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ సూచించారు. రవాణా శాఖ ఆర్టీసీలో విజన్‌ 2047 కి అనుగుణంగా చేర్చిన అంశాలపై ముందుగా కార్యాచరణ తీసుకోవాలని సూచించారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో రవాణా శాఖలో స్థలాలు ఉండి కార్యాలయాలు లేని వాటికి సొంత భవనాలు నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. ఆర్టీసీలో పెండింగ్‌ అంశాలు , కొత్త బస్సుల కొనుగోలు ,ఉద్యోగ నియామకాలు తదితర అంశాలపై చర్చించారు.సమీక్షా సమావేశంలో స్పెషల్‌ సీఎస్‌ వికాస్‌ రాజ్‌, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీధర్‌, ఎంజేపి సెక్రటరీ సైదులు , జెటిసిలు చంద్రశేఖర్‌ గౌడ్‌, శివలింగయ్య, బీసీ సంక్షేమ శాఖ అధికారులు,ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -