నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఏపీ, తెలంగాణ రాష్ట్రాల చైర్మెన్ విమలక్క, ఏఐఎఫ్‌టీయూ అఖిలభారత కార్మిక సంఘాల సమాఖ్య అధ్యక్షులు మల్లేశ్ డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్ లోని మింట్ కౌంపౌండ్‌లో తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మె కు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా విమలక్క మాట్లాడుతూ ప్రభుత్వం, యజమాన్యం స్పందించి విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్‌సీబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీవో 11 ప్రకారం కనీస వేతనం అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. 2026 పీఆర్‌సీ కమిటీని వేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లను వెంటనే పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని కోరారు. కార్యక్రమలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మల్సూర్, పోతుల రమేష్ జేఏసీ చైర్మెన్ సుంకు సతీష్ టీజీ ఎస్పీడీసీఎల్ చైర్మెన్ వెంకటేష్ నాయక్ పాల్గొన్నారు.
ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : అరుణోదయ విమలక్క
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



