Friday, April 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఫీజు దోపిడీపై మహాధర్నాకు సీపీఐ(ఎం)మద్దతు

ఫీజు దోపిడీపై మహాధర్నాకు సీపీఐ(ఎం)మద్దతు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదారాబాద్‌
ప్రయివేట్‌ పాఠశాలల ఫీజు దోపిడీపై ఈ నెల 25న ఆల్‌ ఇండియా నేషనల్‌ రక్షా సేన పార్టీ హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద నిర్వహించనున్న మహాధర్నాకు సీపీఐ(ఎం) మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అడ్మిషన్లు, డొనేషన్లు, రీ-అడ్మిషన్ల పేరుతో విచ్చలవిడిగా లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నాయని తెలిపారు. విద్యను సామాన్యులకు అందకుండా చేస్తున్నాయని పేర్కొన్నారు. పాఠశాలలోనే విద్యార్దులకు సంబంధించిన పలు వస్తువులను తమ వద్దనే కొనాలని నిర్బంధిస్తూ ‘షాపింగ్‌ మాల్స్‌’లాగా నిర్వహిస్తున్నాయని తెలిపారు. విద్యా హక్కు చట్టం అమల్లో ఉన్నా నిరుపయోగంగా మారిందని విమర్శించారు. బలమైన ఫీజు నియంత్రణ చట్టం ఉండాలని పేర్కొన్నారు. ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నదని తెలిపారు. ఆ రకంగా కార్పొరేట్‌ శక్తులకు కొమ్ముకాస్తోందని విమర్శించారు. వాటిని అదుపు చేయడానికి సమగ్ర ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఫీజు వివరాలను ప్రతి పాఠశాల పారదర్శకంగా బహిరం గపరచాలని కోరారు. విద్యా హక్కు చట్టం ప్రకారం 25 శాతం ఉచిత అడ్మిషన్ల ప్రక్రియను పకడ్బందీగా అమలు చేయాలనీ, ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించే పాఠశాలల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -