నవతెలంగాణ ఇబ్రహీంపట్నం
మొదటి విడత ఎన్నికల ప్రక్రియ ముగిసిన 12 వార్డుల్లో గెలిచిన అభ్యర్థులను ఆయా రాజకీయ పార్టీలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. కౌంటింగ్ కేంద్రం నుండి నేరుగా క్యాంపునకు తరలిస్తున్నాయి. కాంగ్రెస్ తరపున గెలిచిన ఐదుగురు అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థిని సైతం కౌంటింగ్ కేంద్రం నుంచే కాంగ్రెస్ అధిష్టానం తన ఆధీనంలోకి తీసుకుంది. ఇప్పటికే ఐదు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించినప్పటికీ స్వతంత్ర అభ్యర్థినీ కూడా కాంగ్రెస్ రెబెల్ కావడంతో ఆ అభ్యర్థిని తన ఖాతాల వేసుకోవాలని చూస్తుంది. అందుకనే కౌంటింగ్ కేంద్రం నుంచి అతన్ని బయటికి రాకుండా తన క్యాంపు తరలించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇక బీఆర్ఎస్ సైతం గెలిచిన ఐదుగురు అభ్యర్థులను మంచి రెడ్డి కిషన్ రెడ్డి తన ఆధీనంలోకి రప్పించుకున్నారు. అయితే బీజేపీ అభ్యర్థి ప్రయాణం ఎక్కడ అన్నది తీరాల్సి ఉంది.
నేరుగా క్యాంపునకే..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


