నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమాసియాలో మరోసారి భీకర దాడులకు తెరలేపింది అమెరికా. ఒకవైపు శాంతి చర్చల పేరుతో కాల్పుల విరమణ ప్రకటించిన ట్రంప్..తాజాగా వైమానిక దాడులకు తెగబడ్డారు. డెహ్రాన్, సిరిక్, మినాబ్, బందర్ అబ్బాస్ ప్రాంతాలపై మిసైళ్ల వర్షం కురిపించింది అమెరికా. దీంతో ఆయా ప్రాంతాలలో పేలుడు శబ్దాలు వినిపించాయి. మరోవైపు ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో కూడా యాక్టివేట్ చేసింది. అంతకు ముందు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కూడా కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని బాంబులు వేనున్నట్లు వెల్లడించారు. దీంతో మళ్లీ రెండు దేశాల మధ్య భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి.
అమెరికా దాడులను కూడా ఇరాన్ దీటుగా బదులిచ్చింది. కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ప్రతిదాడులు చేసింది. తమ దేశంలోని మువాఫాక్ సాల్టీ వైమానిక స్థావరం లక్ష్యంగా దూసుకొచ్చిన ఐదు క్షిపణులను కూల్చివేసినట్లు జోర్డాన్ తెలిపింది.



