న్యూఢిల్లీ : అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశీయంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. బుధవారం ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల మేలిమి పసిడి ధర రూ.4,300 క్షీణించి అన్ని పన్నులు కలుపుకుని రూ.1.56 లక్షలకు చేరగా, కిలో వెండి సైతం దాదాపు రూ.10,000 తగ్గి రూ.2.45 లక్షల వద్ద నమోదయ్యింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర రోజు వ్యవధిలో 90 డాలర్లు క్షీణించి 4,168 డాలర్లకు చేరగా, వెండి ఔన్సు 2.24 శాతం తగ్గి 63.87 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యింది. అమెరికా-ఇరాన్‌ల మధ్య మరోసారి ఘర్షణలు ప్రారంభం కావడంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 90 డాలర్ల ఎగువకు చేరింది. ఇంధన ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న భయాలు, అమెరికా డాలర్ బలోపేతం కావడం, యూఎస్ ఫెడ్ దీర్ఘకాలం పాటు వడ్డీ రేట్లను గరిష్ఠ స్థాయిలోనే కొనసాగించవచ్చనే అంచనాలు ఈ ధరల పతనానికి ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
తగ్గిన బంగారం, వెండి ధరలు
- Advertisement -
- Advertisement -


