Saturday, August 8, 2026
E-PAPER
Homeబీజినెస్వేసవి ప్రకటనల్లో 98 శాతం ఉల్లంఘనలు

వేసవి ప్రకటనల్లో 98 శాతం ఉల్లంఘనలు

- Advertisement -

ఎఎస్‌‌సిఐ నివేదికలో వెల్లడి
హైదరాబాద్‌ :
వేసవి కాలాన్ని లక్ష్యంగా చేసుకుని కంపెనీలు విడుదల చేసిన ప్రకటనల్లో అత్యధికం వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎఎస్‌‌సిఐ) వెల్లడించింది. 2026 ఏప్రిల్ నుంచి జూన్ మధ్య పరిశీలించిన 40 వేసవి ప్రకటనల్లో 39 ప్రకటనలు (98 శాతం) ఎఎస్‌‌సిఐ ప్రకటనల నిబంధనలను ఉల్లంఘించినట్లు ‘ది హీట్ ఈజ్ ఆన్: ఆస్కీ రివ్యూ ఆఫ్ సమ్మర్ అడ్వర్టైజింగ్ క్లెయిమ్స్’ నివేదిక తెలిపింది. వీటిలో 21 కంపెనీలు తమ ప్రకటనలను స్వచ్ఛందంగా సవరించుకోవడం లేదా ఉపసంహరించుకోగా.. మరో 18 ప్రకటనలు విచారణ అనంతరం నిబంధనలకు విరుద్ధమని తేలాయి. కేవలం ఒక ప్రకటన మాత్రమే తన ప్రచార వాదనలకు శాస్త్రీయ ఆధారాలు సమర్పించగలిగింది. ఇటువంటి ప్రకటనల్లో నటించిన సెలబ్రిటీలు కూడా తమ బాధ్యతను నిర్వర్తించలేదని ఎఎస్‌‌సిఐ సిఇఒ, సెక్రటరీ జనరల్ మనీషా కపూర్ పేర్కొన్నారు. వినియోగదారులకు ఖచ్చితమైన, నమ్మదగిన సమాచారం అందించడం ద్వారా మాత్రమే బ్రాండ్లు దీర్ఘకాలిక విశ్వసనీయతను సంపాదించగలవని పేర్కొన్నారు. తప్పుదారి పట్టించే ప్రకటనలను అరికట్టేందుకు సంస్థ పర్యవేక్షణను మరింత కఠినతరం చేస్తామని ఆమె స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -