Thursday, September 17, 2026
E-PAPER
Homeబీజినెస్గొప్ప రెండు BIS ధృవీకరణలను సాధించిన AM/NS  ఇండియా

గొప్ప రెండు BIS ధృవీకరణలను సాధించిన AM/NS  ఇండియా

- Advertisement -

క్వెంచ్డ్ & టెంపర్డ్ ప్లేట్స్  (IS 2062: భాగం  2)మరియు ఆధునిక Zn-Al-Mg తుప్పు-నిరోధక పూతలు (IS 19210)కోసం లైసెన్స్ పొందిన భారతదేశపు మొదటి ఉక్కు తయారీ సంస్థగా మారింది
ఆత్మనిర్భర్ భారత్ నిబంధనల ద్వారా వ్యూహాత్మకమైన మౌళికసదుపాయాలు, రక్షణ మరియు పారిశ్రామిక రంగాలలో ఎక్కువ విలువ కలిగిన దేశీయ సేకరణకు మార్గం వేస్తుంది
నవతెలంగాణ – హజీరా-సూరత్:  రెండు గణనీయమైన కొత్త ప్రమాణాలు ద్వారా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS)ను సంపాదించడం ద్వారా ఆధునిక ఉక్కు తయారీలో తమ నాయకత్వాన్ని అర్సిలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా (AM/NS ఇండియా) శక్తివంతం చేసింది. ఆవిష్కరణ, నాణ్యత మరియు భారత ప్రభుత్వం వారి మేక్ ఇన్ ఇండియా మరియు ఆత్మనిర్భార్ భారత్ కార్యక్రమాలకు కంపెనీ వారి నిబద్ధతను ఈ విజయాలు బలోపేత్తం చేస్తూనే మౌళికసదుపాయాలు మరియు భారీ ఇంజనీరింగ్ రంగాల్లో కొత్త మార్గాలను తెరుస్తోంది.

హాట్ రోల్డ్ క్వెంచ్డ్ & టెంపర్డ్ (Q&T)  స్టీల్ ప్లేట్స్, షీట్స్, స్ట్రిప్స్, మరియు వైడ్ ఫ్లాట్స్ కోసం కొత్తగా పరిచయం చేయబడిన IS 2062 (Part 2):2026 కోసం యావత్ భారతదేశంలో మొదటి BIS లైసెన్స్ పొందిన  AM/NS ఇండియా  భారతదేశఫు   మొదటి స్టీల్ తయారీ సంస్థగా మారింది.  అదే సమయంలో, ప్రీ-పెయింటెడ్ జింక్-అల్యూమినియం-మెగ్నీషియం (Zn-Al-Mg)అల్లాయ్ కోటెడ్ స్ట్లీల్ స్ట్రిప్ మరియు షీట్ కోసం IS 19210:2025 ప్రమాణాల క్రింద కంపెనీ BIS లైసెన్స్ ను పొందింది మరియు భారతదేశపు మార్కెట్ కు ప్రపంచ స్థాయికి చెందిన ఆధునిక స్టీల్ పరిష్కారాలను అందించడంలో ఇది మరొక కీలకమైన విజయంగా నిలిచింది.

BIS లైసెన్స్ లు యొక్క కార్యాచరణ మరియు వాణిజ్యపరమైన ప్రభావాలు :
ప్రభుత్వ సేకరణకు సంబంధించిన నిబంధనల అనుసరణ: ప్రభుత్వ నిధులతో చేపట్టే మౌళిక సదుపాయాలు, రక్షణ మరియు ప్రభుత్వ రంగ ప్రాజెక్టులకు ఉక్కును సరఫరా చేయడానికి BIS ధృవీకరణ తప్పనిసరి.  ఈ  లైసెన్స్ లు తప్పనిసరి సేకరణ ప్రమాణాలను నెరవేరుస్తాయి. ఫలితంగా ఈ ధృవీకరించబడిన  గ్రేడ్స్ అవసరమయ్యే రాష్ట్ర నిధుల ప్రాజెక్టులను సరఫరా చేయడానికి AM/NS ఇండియాకు అనుమతి ఇస్తాయి.  

  • దేశీయంగా లభ్యత & దిగుమతి ప్రత్యామ్నాయం: కోసం మొదటి దేశీయ గ్రహీతగా IS 2062 (Part 2):2026, AM/NS ఇండియా  Q&T స్టీల్ ప్లేట్స్ కోసం స్థానిక సరఫరా మూలాధారం కేటాయిస్తోంది, దిగుమతి చేసిన సామగ్రిలపై ఇంతకు ముందు ఆధారపడిన మార్కెట్ విభాగాలకు పరిష్కారాలు కేటాయిస్తోంది.
  • ఉత్పత్తి పోర్ట్ ఫోలియో విస్తరణ: ఈ లైసెన్స్ లు కంపెనీ వారి హజీరా మరియు పూణే కేంద్రాల్లో తయారు చేయబడిన, ఎక్కువ లోడ్ ను భరించే నిర్మాణపరమైన ఉత్పత్తులు మరియు తుప్పు నిరోధకత పూత కలిగిన ఉత్పత్తుల వంటి ప్రత్యేక ఉత్పత్తుల వాణిజ్య పంపిణీకి వీలు కల్పిస్తాయి.

హజీరా మరియు పూణేలలో  AM/NS ఇండియా వారి ఆధునిక సదుపాయాల్లో తయారైన, ఈ ధృవీకరించబడిన ఉత్పత్తులు అనేవి వేగంగా అభివృద్ధిచెందుతున్న పారిశ్రామిక డిమాండ్లతో ప్రత్యేకమైన పరిష్కారాలను అభివృద్ధిచేయడానికి కంపెనీ యొక్క సాంకేతిక సౌలభ్యతను సూచిస్తున్నాయి.  సంస్థ యొక్క ప్రతిష్టాత్మకమైన రికార్డ్ కు ఈ మైలురాయి మరింత  గౌరవం తెచ్చింది. ఇప్పటికే AM/NS ఇండియా స్టీల్ , చీనాబ్ రైలు బ్రిడ్జితో INS సూరత్, INS విశాఖపట్టణం మరియు ఇటీవల ప్రారంభించబడిన INS మల్వాన్ వంటి వ్యూహాత్మక నౌకాదళ నౌకల నిర్మాణంలో కీలకమైన బాధ్యతను వహించింది.

కొత్తగా ప్రవేశపెట్టబడినIS 2062 (Part 2):2026  అనేది మొదటి BIS ప్రమాణం. ఇది క్వెంచ్డ్ మరియు టెంపర్డ్ స్టీల్ ప్లేట్స్ కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేయబడింది.   ప్రత్యేకమైన హీట్-ట్రీట్మెంట్ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేయబడిన  Q&T స్టీల్ సాటిలేని ఉన్నతమైన శక్తి మరియు మన్నికను అందిస్తోంది, భారీ లోడ్స్ ను తీసుకువెళ్లే సామర్థ్యం గల  తేలికైన మరియు శక్తివంతమైన నిర్మాణాలకు వీలు కల్పిస్తోంది. ఈ ఉత్పత్తులు వంతెనలు, భారీ ఇంజనీరింగ్ సామగ్రి, గనులను తవ్వే యంత్రాలు, ఆఫ్ షోర్ నిర్మాణాలు, సముద్రాల్లో వినియోగించడానికి  మరియు భద్రత మరియు సామర్థ్యాలు కీలకమైన చోట ఇతర ఆవశ్యకమైన పారిశ్రామిక పరిస్థితుల్లో  విస్తృతంగా ఉపయోగించబడతాయి.

 IS 19210:2025  ప్రమాణం అనేది ప్రీ-పెయింటెడ్ జింక్-అల్యూమినియం-మెగ్నీషియం పూత పూసిన ఉక్కు ఉత్పత్తుల కోసం  నాణ్యతతో కూడిన నిర్మాణ పనిని స్థిరపరిచింది. ఈ శ్రేణి కింద AM/NS  ఇండియా ఆఫరింగ్  అనేది అర్సిలార్ మిట్టల్ వారి అంతర్జాతీయంగా గుర్తించబడిన జింక్-అల్యూమినియం-మెగ్నీషియం పూత పూసిన ఉక్కు సాంకేతికత  Optigal®పై ఆధారపడింది.  సంప్రదాయబద్ధమైన రంగులు పూసిన ఉక్కు ఉత్పత్తులతో పోల్చినప్పుడు, ఈ ఆధునిక పూత గణనీయంగా ఉన్నతమైన తుప్పు నిరోధకతను, మెరుగైన ఆధునిక రక్షణ, దీర్ఘకాలం సర్వీస్ జీవితం మరియు తగ్గిన నిర్వహణ అవసరాలను అందిస్తుంది.  ఉత్పత్తులు పైకప్పులు మరియు క్లాడింగ్, ప్రీ-ఇంజనీర్డ్ భవంతులు, మౌళికసదుపాయాలు, గిడ్డంగులు, రైల్వేలు మరియు పారిశ్రామిక నిర్మాణాల్లో విస్తృతంగా ఉపయోగించబడతాయి.

AM/NS ఇండియా  ప్రస్తుతం మూడు ప్రతిష్టాత్మకమైన  IS 3039, IS 18809:2024 and IS 2062 (Part 2):2026 ,గా   25 BIS లైసెన్స్ లను కలిగి ఉంది licences, ఇది భారతదేశపు మార్కెట్ కు పరిచయం చేయడంలో నిరంతర నాయకత్వాన్ని సూచిస్తోంది. 

ఈ తాజా గుర్తింపులు భారతదేశపు దీర్ఘకాలిక మౌళికసదుపాయం మరియు తయారీ రంగం వృద్ధికి ప్రేరణగా నిలిచే , ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉండే ఉక్కు పరిష్కారాలను అందించగల ఒక శక్తివంతమైన నాయకునిగా కంపెనీ  కీర్తి ప్రతిష్టతలను సుస్థిరం చేస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -