Thursday, September 17, 2026
E-PAPER
Homeబీజినెస్ఇంజనీరింగ్ ప్రతిభపై భారీగా పెట్టుబడి పెడుతోన్న వేదాంత పవర్ 

ఇంజనీరింగ్ ప్రతిభపై భారీగా పెట్టుబడి పెడుతోన్న వేదాంత పవర్ 

- Advertisement -

నవతెలంగాణ – న్యూఢిల్లీ: ఇంజనీర్ల దినోత్సవం సందర్భంగా, భారతదేశ విద్యుత్ రంగం కొత్త వృద్ధి దశలోకి ప్రవేశిస్తున్న తరుణంలో, యువ, విభిన్నమైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న శ్రామిక శక్తిని నిర్మించడంలో ఇంజనీరింగ్ ప్రతిభ యొక్క పెరుగుతున్న ప్రాముఖ్యతను వేదాంత పవర్ ప్రముఖంగా తెలియజేస్తోంది. వేదాంత పవర్ మొత్తం ఉద్యోగులలో ఇప్పుడు దాదాపు 50% మంది ఇంజనీర్లే ఉన్నారు. ఇది కంపెనీ కార్యకలాపాలలో సాంకేతిక నైపుణ్యం యొక్క కీలక పాత్రను, అలాగే సంక్లిష్టమైన విద్యుత్ ఆస్తులను నిర్వహించడానికి, కొత్త సాంకేతికతలను స్వీకరించడానికి, మారుతున్న ఇంధన రంగానికి ప్రతిస్పందించడానికి అవసరమైన సామర్థ్యాలను పెంపొందించే దాని ప్రయత్నాలను ప్రతిబింబిస్తుంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వేదాంత పవర్ నియమించుకున్న ఇంజనీర్లలో అధిక సంఖ్యలో మహిళలు ఉండటంతో కంపెనీ తన ఇంజనీరింగ్ శ్రామిక శక్తిలో వైవిధ్యాన్ని కూడా బలోపేతం చేస్తోంది. ఇంజనీరింగ్ ఉద్యోగ విధుల్లోకి ఎక్కువ మంది మహిళలను తీసుకురావడంపై దృష్టి పెట్టడం, విద్యుత్ రంగ భవిష్యత్తు కోసం మరింత విభిన్నమైన ప్రతిభావంతుల సమూహాన్ని సృష్టించాలనే వేదాంత పవర్ యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.

ఇంజనీర్స్ డే సందర్భంగా , విద్యుత్ రంగ భవిష్యత్తు కోసం ఇంజనీరింగ్ ప్రతిభను అభివృద్ధి చేయాల్సిన ప్రాముఖ్యత గురించి వేదాంత పవర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ , హోల్-టైమ్ డైరెక్టర్ శ్రీ రాజిందర్ సింగ్ అహుజా మాట్లాడుతూ, “భారతదేశ విద్యుత్ వృద్ధి ప్రస్థానం ఒక ఉత్తేజకరమైన దశలోకి ప్రవేశిస్తోంది. మనం కేవలం ఎక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేసి, సరఫరా చేయడమే కాకుండా, నూతన సాంకేతికతలను స్వీకరించటం, సామర్థ్యాలను మెరుగుపరచడం, నిరంతరం మారుతున్న ఇంధన రంగానికి అనుగుణంగా స్పందించడం ద్వారా సంక్లిష్టమైన విద్యుత్ ఆస్తులను నిర్వహించడానికి అవసరమైన ఇంజనీరింగ్ సామర్థ్యాలను కూడా బలోపేతం చేయాలి” అని అన్నారు.  

ఆయన ఇంకా చెబుతూ “వేదాంతలో సామర్థ్యాన్ని పెంపొందించడం, నైపుణ్యాన్ని అభివృద్ధి చేయటం అనేవి రెండూ ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి కాబట్టి, ఈ విషయం మా సొంత ఉద్యోగులలోనే ప్రతిబింబిస్తోంది. ప్రస్తుతం మా ఉద్యోగులలో దాదాపు సగం మంది ఇంజనీర్లే ఉన్నారు. మా ఇంజనీరింగ్ బృందాలలో మహిళలు మరియు యువ నిపుణుల భాగస్వామ్యం పెరుగుతుండటం కూడా మాకు సంతోషాన్ని  ఇస్తోంది. మేము వారికి వ్యాపార పరిచయం, అనుభవజ్ఞులైన నాయకులతో పరిచయం, బాధ్యతలను స్వీకరించే అవకాశాన్ని కల్పించాలనుకుంటున్నాము. తద్వారా వారు భారతదేశ విద్యుత్ రంగ తదుపరి అధ్యాయాన్ని తీర్చిదిద్దే విద్యుత్ నాయకులుగా ఎదగగలరు”అని అన్నారు. 

యువ ప్రతిభపై కంపెనీ దృష్టి సారించడానికి, ఇంజనీరింగ్ మరియు మేనేజ్‌మెంట్ కళాశాలలలో క్యాంపస్ స్థాయిలో చేపట్టే కార్యక్రమాల మద్దతు లభిస్తోంది. తమ ఇటీవలి క్యాంపస్ నియామకాలలో భాగంగా వేదాంత పవర్ యువ నిపుణులను, మహిళా ఇంజనీర్లను నియమించుకుంది. తద్వారా సంస్థలోకి నూతన ప్రతిభను, విభిన్న దృక్కోణాలను తీసుకువచ్చింది. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఎంలు మొదలైన దేశవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి సంస్థల నుండి ప్రతిభావంతులను ఎంపిక చేయడం జరిగింది.

తమ ఉద్యోగులలో దాదాపు సగం మంది ఇంజనీర్లే కావడంతో, వేదాంత పవర్ యొక్క భారీ విద్యుత్ ఆస్తుల రోజువారీ కార్యకలాపాలలో ఇంజనీరింగ్ ప్రతిభ కీలక పాత్ర పోషిస్తుంది. వివిధ విభాగాలలో, ఇంజనీర్లు ప్లాంట్ విశ్వసనీయతను కాపాడుకోవడానికి, కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, విద్యుత్ రంగం యొక్క మారుతున్న అవసరాలకు మద్దతు ఇచ్చే సాంకేతికతలను స్వీకరించడానికి దోహదపడతారు. వివిధ నేపథ్యాలకు చెందిన నిపుణులు ఇంజనీరింగ్, కార్యకలాపాలు మరియు ఇతర విభాగాలలో వైవిధ్యభరితమైన దృక్పథాలను తీసుకురాగలిగే వాతావరణాన్ని కల్పించడంపై కూడా కంపెనీ దృష్టి సారించింది. 

భారతదేశ విద్యుత్ రంగంలో  మారుతున్న ఇంధన అవసరాలు, సాంకేతిక పురోగతి, మరింత సంక్లిష్టమైన విద్యుత్ వ్యవస్థలు కనిపిస్తోన్న తరుణంలో, యువ ఇంజనీరింగ్ ప్రతిభపై కంపెనీ దృష్టి సారించింది. ఈ మార్పులు బలమైన సాంకేతిక సామర్థ్యాలను వ్యాపార అవగాహన, సమస్య పరిష్కార నైపుణ్యాలు మరియు అనుకూలతతో మిళితం చేసే నిపుణులకు డిమాండ్‌ను సృష్టిస్తున్నాయి. క్యాంపస్ రిక్రూట్ మెంట్ కార్యకలాపాలను బలోపేతం చేయడం ద్వారా, ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్లను సంస్థలోకి తీసుకురావడం ద్వారా, ఈ పరివర్తనకు దోహదపడగల ప్రతిభావంతుల సమూహాన్ని అభివృద్ధి చేయడంపై వేదాంత పవర్ దృష్టి సారించింది.

రేపటి విద్యుత్ మౌలిక సదుపాయాలను నిర్మించాలంటే, దానిని నిర్వహించే, ఆవిష్కరించే మరియు నడిపించే వ్యక్తులపై నిరంతర పెట్టుబడి అవసరమనే నమ్మకమే కంపెనీ విధానానికి ఆధారం. యువ ప్రతిభ, ఇంజనీరింగ్ సామర్థ్యం, క్యాంపస్ నియామకాలు , కార్యాలయ వైవిధ్యంపై దృష్టి సారించడం ద్వారా, భారతదేశ మారుతున్న ఇంధన రంగం మరియు దాని విస్తృత వృద్ధి లక్ష్యాలకు తోడ్పడగల నిపుణులను తీర్చిదిద్దేందుకు వేదాంత పవర్ కట్టుబడి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -