Saturday, August 8, 2026
E-PAPER
Homeబీజినెస్ప్రీకాన్‌ ఏఐ నిర్మాణ వేదిక లోగో ఆవిష్కరణ

ప్రీకాన్‌ ఏఐ నిర్మాణ వేదిక లోగో ఆవిష్కరణ

- Advertisement -

న్యూఢిల్లీ : మధ్యప్రాచ్య నిర్మాణ రంగంలో కృత్రిమ మేధ (ఎఐ) వినియోగాన్ని విస్తరించే లక్ష్యంతో కెనడా–భారత్ నిపుణులు అభివృద్ధి చేసిన ‘ప్రీకాన్’ ఏఐ ఆధారిత నిర్మాణ సాంకేతిక వేదిక లోగోను దుబాయ్‌లో భారత కాన్సుల్ జనరల్ డా. ఈ. విష్ణువర్ధన్ రెడ్డి ఆవిష్కరించారు. నిర్మాణ ప్రాజెక్టుల ప్రణాళిక, వ్యయ అంచనాలు, టెండర్ విశ్లేషణను వేగవంతం చేసే ఈ ప్లాట్‌ఫామ్‌ను శ్రీధర్ గొనెపల్లి (సన్నీ), ఉమా మహేష్ ముక్కరా రూపొందించగా, యూఏఈ మార్కెట్ ప్రవేశానికి సందీప్ మక్తాల వ్యూహాత్మక సమన్వయం అందించారు. ఈ సందర్భంగా భారత్–కెనడా–యుఎఇల మధ్య సాంకేతిక భాగస్వామ్యం మరింత బలోపేతం కావడం అభినందనీయమని డా. ఈ. విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. జీసీసీ దేశాల్లో విస్తరణలో భాగంగా రాస్ అల్ ఖైమా ప్రభుత్వం, షార్జా రీసెర్చ్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పార్క్ (ఎస్‌ఆర్‌‌టిఐపి) అధికారులతో జరిపిన చర్చలు సానుకూలంగా ముగిశాయని, నిర్మాణ రంగాన్ని ఏఐతో మరింత సమర్థవంతంగా మార్చే ప్రపంచ స్థాయి పరిష్కారాలను అందించడమే లక్ష్యమని సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ గొనెపల్లి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -