Thursday, June 11, 2026
E-PAPER
Homeబీజినెస్ఎగిసి.. పడిన మార్కెట్లు

ఎగిసి.. పడిన మార్కెట్లు

- Advertisement -

ముంబయి : పశ్చిమాసియా పరిణా మాలతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం తీవ్ర ఊగిసలాటకు గురైయ్యాయి. మెటల్, పిఎస్‌‌యు బ్యాంక్, రియాల్టీ స్టాక్స్ మద్దతుతో ఉదయం లాభాలతో ప్రారంభమైన ప్పటికీ.. చివరి నిమిషంలో వచ్చిన అమ్మకాల ఒత్తిడితో ఆ లాభాలను కోల్పోయాయి. ఇంట్రాడేలో ఒకానొక దశలో 600 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్.. ముగిసే సమయానికి 64 పాయింట్ల స్వల్ప లాభంతో 73,983.18 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ మాత్రం ఆరంభ లాభాలను పూర్తిగా కోల్పోయి.. 27.15 పాయింట్ల నష్టంతో 23,214.95 వద్ద నమోదయ్యింది. సెన్సెక్స్ 30 సూచీలో హిందుస్థాన్ యూనిలీవర్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఐటిసి వంటి షేర్లు లాభాల్లో ముగియగా; టాటా స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎటర్నల్ వంటి ప్రముఖ షేర్లు నష్టాలను చవిచూశాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -