Thursday, June 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపంజాగుట్ట ఎఎస్సై ఖాతా నుండి డబ్బు కాజేసిన సైబర్ నేరగాళ్లు

పంజాగుట్ట ఎఎస్సై ఖాతా నుండి డబ్బు కాజేసిన సైబర్ నేరగాళ్లు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట పిఎస్‌లో ఎఎస్సైగా పనిచేస్తున్న నరసయ్య సైబర్‌ మోసానికి గురయ్యారు. ఆర్టీఏ చలాన్‌ పేరుతో సైబర్‌ నేరగాళ్లు ఆయనకు ఎపి కే ఫైల్‌ పంపించారు. తద్వారా నరసయ్య బ్యాంకు ఖాతా నుంచి రూ.49,139 కాజేశారు. ఈనెల 8న తన మొబైల్‌ ఫోన్‌కు పలుమార్లు మెసేజ్‌లు వస్తుండటంతో ఎఎస్సై పరిశీలించారు. తన బ్యాంకు ఖాతా నుంచి డబ్బు కట్‌ అవుతున్నట్లు గుర్తించారు. తన ప్రమేయం లేకుండా నగదు పోతుండటంతో ఆందోళనకు గురై సైబర్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1930కు ఫిర్యాదు చేశారు. సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -