- Advertisement -
నవతెలంగాణ-ఆలేరు టౌను
ఆలేరు పట్టణంలో రైల్వే గేట్ వద్ద మిషన్ భగీరథ పైప్‌లైన్ పగిలి, నీరు రోడ్డును దాటి ఇండ్లల్లోకి వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. స్తానికుల ద్వారా సమాచారం అందుకున్న మిషన్ భగీరథ ఈఈ కరుణాకర్ ఏఈ స్వాతితో కలిసి గురువారం పైప్ లైన్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పగిలిన పైప్ లైన్ చోట, కొత్త పైప్ లైన్ ఏర్పాటు చేసి మరమ్మత్తు పనులను త్వరతగతిన పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్తానికులు, గ్రిడ్ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



