Friday, June 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలు'మా ఇంటి బంగారం’కి సెన్సార్ ప్రశంసలు

‘మా ఇంటి బంగారం’కి సెన్సార్ ప్రశంసలు

- Advertisement -

ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘మా ఇంటి బంగారం’. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఈనెల 19న విడుదల కాబోతోంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌లతో సినిమా టీం ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన సెన్సార్ పూర్తయింది. ఈ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ సభ్యులు మేకర్స్‌ను అభినందించారు. ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఇక ఈ చిత్రం ఈనెల 19న గ్రాండ్ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇప్పటికే సమంత ఈ సినిమా గురించి ఎన్నో విశేషాల్ని పంచుకున్నారు. తాజాగా ఇన్ స్టాలో తన అభిమానులతో ముచ్చటిస్తూ ఈ మూవీకి సంబంధించిన ఎన్నో విషయాల్ని తెలియజేశారు.
ప్రేక్షకులు పెట్టే డబ్బు, వెచ్చించే సమయం ఇలా అన్నింటికీ న్యాయం చేసేలా సినిమా ఉంటుందని టీం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించారు. ఓం ప్రకాష్ కెమెరామెన్‌గా, ధర్మేంద్ర కాకరాల ఎడిటర్‌గా పని చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు ఈ సినిమా 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో శ్రీముఖి, గౌతమి, ఆనంద్, లక్ష్మి, శ్రీనివాస్ గవిరెడ్డి, మంజుష, దిగంత్, గుల్షన్ దేవయ్యలు ముఖ్య పాత్రలు పోషించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -